Begin typing your search above and press return to search.

అదే చ‌ర్చ : గ‌వ‌ర్న‌ర్‌తో కేసీఆర్ భేటీ

By:  Tupaki Desk   |   7 Oct 2015 3:22 PM GMT
అదే చ‌ర్చ : గ‌వ‌ర్న‌ర్‌తో కేసీఆర్ భేటీ
X
రాష్ర్ట గ‌వ‌ర్న‌ర్ ఈఎస్ఎల్ న‌ర‌సింహ‌న్‌తో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. అసెంబ్లీ స‌మావేశాలు ముగిసిన వెంట‌నే తెలంగాణ ముఖ్య‌మంత్రి గ‌వ‌ర్న‌ర్ వ‌ద్ద‌కు వెళ్లారు. వారం రోజుల వ్య‌వ‌ధిలోనే కేసీఆర్ గ‌వ‌ర్న‌ర్‌తో రెండు సార్లు స‌మావేశం అవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. అంతుకుముందు అసెంబ్లీ స‌మావేశాల ప్రారంభం సంద‌ర్భంగా కేసీఆర్ గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిశారు. ఇంత త‌ర‌చుగా గ‌వ‌ర్న‌ర్‌ను క‌ల‌వ‌డంపై భిన్న‌భిప్రాయాలు వ్య‌క్తమ‌వుతున్నాయి.

గురువారం టీఆర్ఎస్ఎల్పీ స‌మావేశం జ‌రుగ‌నుంది. అసెంబ్లీ స‌మావేశాలు ముగిసిన మ‌రుస‌టి రోజే శాస‌న‌స‌భాప‌క్ష స‌మావేశం ఏర్పాటుచేసిన నేప‌థ్యంలో కేబినెట్‌ మార్పులు చేర్పుల గురించి చ‌ర్చించేందుకు గ‌వ‌ర్న‌ర్ వ‌ద్ద‌కు కేసీఆర్ వెళ్తున్నారా అనే చ‌ర్చ రాజ‌కీయ‌వ‌ర్గాల్లో జ‌రుగుతోంది. ఈ మ‌ధ్య కాలంలో త‌న మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రుల‌పై సీఎం కేసీఆర్ అస‌హ‌నం వ్య‌క్తం చేస్తుండ‌టం ఇందుకు బ‌లం చేకూరుస్తోంది. అసెంబ్లీ స‌మావేశాలు ముగిసిన నేప‌థ్యంలో గ‌తంలోనే హామీ ఇచ్చిన‌ట్లు నామినేటెడ్ పోస్టుల భ‌ర్తీకి కేసీఆర్ గ్రీన్‌సిగ్న‌ల్ ఇవ్వ‌నున్నార‌ని, ఆ ప్ర‌క్రియ గురించి రాజ్యాంగ పెద్ద అయిన గ‌వ‌ర్న‌ర్ కు స‌మాచారం ఇచ్చేందుకు వెళ్తున్నార‌ని పేర్కొంటున్నారు. అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా ఉమ్మ‌డి స‌భ‌ల‌ను స‌మావేశ‌ప‌రిచి తెలంగాణ జ‌ల‌విధానం గురించి ప‌వ‌ర్ పాయింట్ ప్రెజెంట్ చేయ‌నున్న‌ట్లు, దానికి గ‌వ‌ర్న‌ర్‌ను రావాల్సిందిగా కోరిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. అయితే అదేమీ లేకుండా అసెంబ్లీ వాయిదా ప‌డిన నేప‌థ్యంలో ఈ విష‌యంలో వివ‌ర‌ణ ఇచ్చేందుకు గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిశార‌ని అధికార పార్టీ వ‌ర్గాలు వివ‌రిస్తున్నాయి.