మహారుద్ర సహిత సహస్ర చండీ యాగం

Sun Jan 20 2019 16:29:31 GMT+0530 (IST)

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు మిగతరాజకీయ నాయకులతో పోలిస్తే కాస్త భక్తి ఎక్కువే. ఈ నెల 21వ తేదీ నుంచి 24వ తెదీ వరకూ ఆయన మహారుద్ర సహిత చండీ యాగం చేయానున్నారు. దీని కోసం కేసీఆర్ ఫార్మ్  హస్ లో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. శారదా పీఠానికి చెందిన వేదపండితులు ఈ యాగానికి కావాల్సిన ఏర్పాట్లు చూస్తున్నారు. ఈ యాగం కోసం ముఖ్యమంత్రి ఫార్మ్ హౌస్ లో 3 ‍యజ్ణశాలలు నిర్మించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు 27 హోమగుండాలు కూడా తయారు చేసారటా.. ఈ యాగం నిర్వహించడానికి దాదాపు 200 మంది రుత్వికులు  ఫార్మ్ హౌస్ కి వచ్చి ఏర్పాట్లు పర్యావేక్షిస్తున్నారని వీరితో పాటు చాల మంది పండితులు కూడా ఈ యాగం నిర్వహించాడానికి ఇప్పటికే ఫార్మ్ హౌస్ కి చేరుకున్నట్లు సమాచారం.తెలంగాణ ముఖ్యమంత్రి గతంలో ఆయుత చండీ యాగం నిర్వహించారు. 2018లో ఎన్నికలకు ముందు కూడా రాజాశ్యామల యాగం కూడా చేసారు. ఈ యాగాలే ఆయనకు తిరిగి ముఖ్యమంత్రి పీఠం దక్కెలా చేసాయని ఆయన అపారా నమ్మకం. తాను తిరిగి అధికారంలోకి వస్తే మహారుద్ర సహిత సహస్ర చండీ యాగం నిర్వహిస్తానని దేవుడికి మొక్కుకున్నారటా... అనుకున్నట్లే ఆయనకు ముఖ్యమంత్రి పదవి దక్కిందని అందుకే ముఖ్యమంత్రి మొక్కు తీర్చుకుంటున్నారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. గత సంవత్సరం జూన్ నెలలో ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు విజయవాడ కనకదుర్గ గుడికి వెళ్లి మొక్కు చెల్లించుకున్నారు. తెలంగాణ వస్తే తాను కనకదుర్గమ్మకు ముక్కు పుడక చెల్లిస్తానని మొక్కుకున్నట్లు సమాచారం. 57వజ్రాలు పొదిగిన బంగారు ముక్కుపుడకను అమ్మవారికి సమర్పించుకున్నారు. ఇలా తెలంగాణ ముఖ్యమంత్రికి మిగత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పోలిస్తే భక్తి ఎక్కువేనని చెప్పుకోవాలి. అన్నట్లు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నిర్వహించబోయే ఐదు రోజుల మహా సహస్ర సహిత చండీ యాగానికి తెలంగాణ ఎంపీలను ఎమ్మెల్యేలను పార్టీ సినీయర్ నాయకులను ఆహ్వానిస్తారని తెలుస్తోంది.