Begin typing your search above and press return to search.

ఎన్డీఏ రాష్ట్రప‌తి అభ్య‌ర్థి వెనుక కేసీఆర్‌?!

By:  Tupaki Desk   |   19 Jun 2017 10:55 AM GMT
ఎన్డీఏ రాష్ట్రప‌తి అభ్య‌ర్థి వెనుక కేసీఆర్‌?!
X
ఎన్డీఏ రాష్ట్రప‌తి అభ్యర్థిగా బీహార్ గ‌వ‌ర్న‌ర్ రామ్‌ నాథ్ కోవిద్‌ ను ఎంపిక చేయ‌డం వెనుక తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్నారా? గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ చెప్పిన నిర్ణ‌యానికే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ఓకే చెప్పేశారా? అంటే అవున‌నే స‌మాధానం తెలంగాణ‌లో అధికార టీఆర్ ఎస్ పార్టీ త‌ర‌ఫున వినిపిస్తోంది. రాష్ట్రపతి అభ్యర్థిగా బీహార్ గవర్నర్ రామ్‌ నాథ్ కోవిద్‌ ను ఎంపిక చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ ప్ర‌క‌ట‌న అనంత‌రం తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కార్యాల‌యం నుంచి ఒక ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. దీంతో పాటుగా సీఎం కేసీఆర్ త‌న‌యుడు కేటీఆర్ ట్వీట్ ఒక‌టి ఇదే భావాన్ని వ్య‌క్త‌ప‌రిచింది.

తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయ ప్ర‌క‌ట‌నలో ఎన్డీఏ పక్షాన పోఈ చేసే రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌ నాథ్ కోవింద్‌ ను ప్రకటించిన మరుక్షణమే రాస్త్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు స్వయంగా ఫోన్ చేసి ప్రధానమంత్రి నరేంద్రమోడీ మద్ధతు కోరినట్లు పేర్కొంది. ‘‘మీ సూచన మేరకే ఒక దళిత నాయకుడిని రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేశాం’’ అని ముఖ్యమంత్రికి చెప్పి ప్రధానమంత్రి మద్ధతు కోరినట్లు వివ‌రించింది. తక్షణమే ఆఘ‌మేఘాల మీద టీఆర్ ఎస్ పార్టీ నాయకులను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సంప్రదించినట్లు వివ‌రించింది. ఒక దళిత నాయకున్ని రాష్ట్ర అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్రపతి అభ్యర్థికి తమ పూర్తి మద్ధతును ముఖ్యమంత్రి ప్రకటించినట్లు తెలిపింది.

మ‌రోవైపు ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌ నాథ్ కోవిద్‌ కు ముఖ్యమంత్రి కేసీఆర్ మద్దతు తెలిపారని కేటీఆర్ వివ‌రించారు. ఎన్డీఏ రాష్ర్టపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవిద్ ను ఎంపిక చేసిన విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ఫోన్ చేసిన అనంత‌రం సీఎం కేసీఆర్ మద్దతు తెలిపినట్లు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/