Begin typing your search above and press return to search.

ఆహ్వానం గురించి కేసీఆరూ చెప్పారు

By:  Tupaki Desk   |   25 Nov 2015 5:22 AM GMT
ఆహ్వానం గురించి కేసీఆరూ చెప్పారు
X
పేరులోనే కాదు.. కొన్ని అలవాట్ల విషయంలోనూ రెండు తెలుగు రాష్ట్రాల చంద్రుళ్ల మధ్య చాలానే పోలికలు ఉంటాయి. దసరా పర్వదినం నాడు ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆహ్వానిస్తున్న విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పటం.. అలానే చేతల్లో చేసి చూపించటం గతం. కాకపోతే.. అమరావతి శంకుస్థాపనకు కేసీఆర్ ను ఆహ్వానిస్తున్న విషయాన్ని చంద్రబాబు మీడియా సమావేశంలో వెల్లడించారు.

బాబు మాదిరే కేసీఆర్ సైతం.. డిసెంబరులో తాను నిర్వహించే ఆయుత చండీయాగానికి సంబంధించిన కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు. చంద్రబాబు మాదిరే కేసీఆర్ సైతం.. తన ఆహ్వానం విషయాన్న మీడియా సమావేశంలోనే వెల్లడించటం విశేషం. తాను నిర్వహిస్తున్న ఆయుత చండీ యాగానికి సంబంధించి పలు విషయాల్ని కేసీఆర్ చెప్పుకొచ్చారు.

యాగాన్ని తన సొంత ఖర్చుతోనే నిర్వహిస్తున్నానని.. యాగానికి సంబంధించి సీపీఐ నేత సురవరం సుధాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు. ప్రభుత్వ ఖర్చుతో యాగాన్ని నిర్వహిస్తున్నట్లు సురవరం పేర్కొన్నారని.. కానీ.. తన సొంత ఖర్చుతో నిర్వహిస్తున్న యగానికి కొంతమంది ఉత్సాహవంతులు స్పాన్సర్ చేయటానికి ముందుకు వస్తున్న విషయాన్ని కేసీఆర్ ఓపెన్ గానే చెప్పేశారు. ఆయుత చండీయగానికి రాష్ట్రపతి ప్రణబ్ దా.. ప్రధానమంత్రి మోడీతో పాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా పిలుస్తున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. కేసీఆర్ తాజా మాటల నేపథ్యంలో ఇద్దరు చంద్రుళ్లు మరో మారు కలిసే అవకాశానికి సంబంధించి టైం ఫిక్స్ అయినట్లేనని చెప్పాలి.