Begin typing your search above and press return to search.

కేసీఆర్ డిసైడ్.. మంత్రులుగా ముగ్గురు మహిళలు

By:  Tupaki Desk   |   13 Dec 2018 7:30 AM GMT
కేసీఆర్ డిసైడ్.. మంత్రులుగా ముగ్గురు మహిళలు
X
కేసీఆర్ ఈసారి మంత్రివర్గంపై తీవ్ర కసరత్తు చేస్తున్నారు. 2014లో బోటాబోటీగా గెలవడంతో సీనియర్లు, కష్టపడ్డవారు, బలమైన నేతలకు మంత్రి పదవులు ఇచ్చారు. తెలంగాణ ఉద్యమ ద్రోహులకు సైతం మంత్రి పదవులు ఇచ్చారన్న విమర్శలు వచ్చాయి. తలసాని, తుమ్మల, మహేందర్ రెడ్డిలకు పదవులు ఇస్తారా అని విమర్శించారు. అంతేకాదు.. తెలంగాణ జనాభాలో సగం ఉన్న మహిళలకు మంత్రి వర్గంలో చోటు లేకపోవడంపై అందరూ దుమ్మెత్తిపోశారు. దీంతో ఇప్పుడు ఆ తప్పులను సరిచేయాలని కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నట్టు వార్తలొస్తున్నాయి..

తెలంగాణ మంత్రివర్గంలో మొత్తం 18 మంత్రి పదవులు ఇవ్వవచ్చు. కేసీఆర్ మినహా 17మందికి కేబినెట్ లో చోటు ఉంది. వీరే కాకుండా తెలంగాణ శాసనసభకు స్పీకర్ - డిప్యూటీ స్పీకర్. చీఫ్ విప్ - ముగ్గురు విప్ ల పదవులు ఇవ్వవచ్చు.

ఈ నేపథ్యంలోనే మంత్రివర్గంలో ఈసారి ఎస్సీలు - ఎస్టీలు - బీసీలు.. ఆయా సామాజికవర్గాలు - ఉమ్మడి జిల్లాలను బేస్ చేసుకొని ఇవ్వాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారట.. ఇందులో భాగంగానే ఈరోజు మధ్యాహ్నం కేసీఆర్ పరిమిత స్థాయిలోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.

మరో నాలుగు రోజుల్లో కసరత్తు పూర్తి చేసి మహిళలకు.. ముఖ్యంగా ఎస్సీ - ఎస్టీ బీసీ వర్గాలకు కేబినెట్ లో పెద్దపీట వేయబోతున్నారట.. ఎస్టీ కేటగిరిటీలో ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ కు మంత్రి పదవి ఖాయంగా కనిపిస్తోంది. రేఖానాయక్ కు మినిస్టర్ పదవి ఇస్తే ఇటు మహిళా కోటాతోపాటు ఎస్టీ కోటా కూడా భర్తీ అవుతుందని కేసీఆర్ భావిస్తున్నారట.. ఇక ఆదిలాబాద్ నుంచే రెండో మంత్రి పదవి ఎమ్మెల్యేగా గెలిచిన ఎస్సీ సామాజికవర్గానికి చెందిన బాల్క సుమన్ కు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది.

వీరిద్దరే కాకుండా మహిళా కోటాలో మెదక్ జిల్లా నుంచి పద్మాదేవేందర్ రెడ్డి. నల్గొండ నుంచి గొంగడి సునీతలకు ఈసారి మంత్రి పదవులు ఖాయమని తెలుస్తోంది. ఎస్టీ - బీసీ - ఓసీ కేటగిరిల్లో ముగ్గురు మహిళలను చేర్చుకుంటే సామాజిక కోణం, మహిళా కోటా పూర్తవుతుందని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలిసింది. ఈసారి మంత్రివర్గంపై ఎలాంటి విమర్శలు రాకుండా కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు సమాచారం.