Begin typing your search above and press return to search.

కేసీఆర్ దాచిన ఆ రెండు స్కీమ్ లు ఇవేనా?

By:  Tupaki Desk   |   23 Sep 2019 5:28 AM GMT
కేసీఆర్ దాచిన ఆ రెండు స్కీమ్ లు ఇవేనా?
X
తెలంగాణ అసెంబ్లీలో ఆదివారం మాట్లాడిన సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఇంకా రెండు స్కీములున్నాయి. అవి పెడితే మీ పని ఖతమేనని.. అవి అమలైతే గతంలో చెప్పినట్లుగా రెండు మూడు టర్మ్ లు గెలుస్తాం.’ అంటూ ధీమాతో కాంగ్రెస్ నేతలకు వార్నింగ్ ఇచ్చారు కేసీఆర్. ఇప్పుడు కేసీఆర్ దాచిన ఆ రెండు అద్భుత పథకాలేంటి? వాటిని అమలు చేస్తే కేసీఆర్ కు అధికారం మళ్లీ వస్తుందా? ఇంతకీ కేసీఆర్ దాచిన ఆ పథకాలేంటనే దానిపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది.

తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ బీజేపీని తీసిపారేశారు. కాంగ్రెస్ ను చెడుగుడు ఆడేశారు. అమాస - పున్నానికి వచ్చి లొల్లి చేసే బీజేపీ ఆటలు తెలంగాణలో సాగవన్నారు. కాంగ్రెస్ అసలు తమకే పోటీకాదంటూ గడిచిన ఎన్నికలకు ఈ ఎన్నికలకు ఎవరి బలం తగ్గిందో తెలుసుకోండని లెక్కలు చెప్పారు.

కేసీఆర్ అంత ధీమాగా ఆ రెండు పథకాల గురించి చెప్పడంపై ఆసక్తి కర చర్చ జరుగుతోంది. కేసీఆర్ అమ్ముల పొదిలోని అస్త్రాలు ‘తెలంగాణ అంతటా ఉచిత వైద్యం - యువతకు ఉద్యోగాల కల్పన’ ఈ రెండేననే చర్చ గులాబీ ముఖ్యుల వర్గాల్లో సాగుతోందట..

ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 3.5 కోట్ల మంది మొత్తం జనాభాకు అందరికీ ఉచిత వైద్యం అందిస్తే ఎంత లెక్కువుతుందని కేసీఆర్ ఆరాతీశారట.. పేదలకు ఉచితంగా.. ఉన్నత వర్గాలకు కొంత మొత్తం వసూలు చేసి హెల్త్ కార్డులు ఇచ్చి తెలంగాణ వ్యాప్తంగా ఉచిత వైద్యం అందించేందుకు కేసీఆర్ ఇప్పటికే దీనిపై నివేదికలు - అంచనాలు - ఖర్చు లెక్కను తెప్పించుకున్నారట.. వచ్చే 2024 ఎన్నికల ముందర ఈ అద్భుత పథకాన్ని ప్రవేశపెట్టి మళ్లీ అధికారంలోకి వచ్చే స్కెచ్ గీసినట్టు తెలిసింది.

ఇక రెండోది యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన. తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగుల లెక్కలు తీసి పరిశ్రమలతో టై అప్ అయ్యి ప్రభుత్వం నడిపించే అన్నింట్లోనూ - ప్రైవేటు పరిశ్రమల్లోనూ ప్రభుత్వమే రిక్రూట్ చేసే కొత్త పథకాన్ని కేసీఆర్ రూపొందించారట..వైన్ షాపులు - రేషన్ షాపులు - ఇతర ప్రభుత్వ సేవలన్నింటిని యువతకు అప్పంగించేందుకు ప్లాన్ చేశారట.. ఖాళీగా ఉండే వారికి నెలకు నిరుద్యోగ భృతి ఇస్తారట.. ఈ రెండు పథకాలకు బడ్జెట్ కొరతతో కేసీఆర్ ప్రస్తుతానికి పక్కనపెట్టినప్పటికీ భవిష్యత్ లో అధికారంలోకి రావడానికి ఇవే సోపానాలని భావిస్తున్నారట.. కేసీఆర్ దాచిన రెండు సీక్రెట్ పథకాలు ఇవేనంటూ ప్రస్తుతం తెలంగాణ పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.