Begin typing your search above and press return to search.

అబ్బాయిని కలవండి....

By:  Tupaki Desk   |   25 Sep 2018 3:53 PM GMT
అబ్బాయిని కలవండి....
X
సార్ మా నియోజకవర్గంలో బహిరంగ సభకు ఎప్పుటికి సిద్దం
చేయమంటారు.......ఒక అభ్యర్ది ప్రశ్న....
వెళ్లి అబ్బాయిని కలవండీ...అధినేత సమాధానం.

సార్ జిల్లాలో పార్టీ ఎన్నికల కార్యాలయ ప్రారంభోత్సావానికి మీరు
రావాలి......ఓ సీనియర్ నాయకుని అభ్యర్దన.....
తమ్మీ....వెళ్లి అబ్బాయితో మాట్లాడు.....

అన్నా జిల్లాలో గెలుచుడు ఖాయం....కాపోతే ఒకటి రెండు చోట్ల మీ
బహిరంగ సభలో మీరు మాట్లాడాలి......
గట్లనే కాని ముందు పోయి చిన్న సార్‌ ని కలు..

ఇదంతా సినిమా డైలాగుల అనుకుంటున్నారా.....లేదూ నాటక రిహార్సిల్ అనుకుంటున్నారా. కానే కాదు తెలంగాణ రాష్ట్ర సమితీలో ముందస్తుకు ముందు జరుగుతున్న ప్రస్థానం.

ముందుస్తు ఎన్నికలు ప్రకటించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితీలో ఏదో జరుగుతోంది. అధినాయకుల మధ్య వార్ నడుస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తెలంగాణ రాష‌్ట్ర సమితి నాయకుడు - ఆపదర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన కుమారుడు తారక రామారావుకి అన్నీ బాధ్యతలు అప్పగించినట్లు రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ తన మేనల్లుడు హరీష్ రావు ప్రధాన్యత తగ్గించి తన కుమారుడు తారక రామారావును తెరపైకి తీసుకుని వస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలో 100 బహిరంగ సభలు నిర్వహిస్తామని కేసీఆర్ ప్రకటించారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి ఏమంత సహకరించటం లేదని - కొన్ని సభలలో కేటిఆర్ పాల్గొంటారని పార్టీలో చర్చ జరుగుతోంది. అందులో భాగంగానే తనను కలసిన నాయకులను కేటీఆర్ ను కూడా కలవాలని ఆపధర్మ ముఖ‌్యమంత్రి కేసీఆర్ సూచించినట్లు చెబుతున్నారు. దీని వెనుక కుమారుడు తారక రామారావుకు మెల్లి మెల్లిగా పార్టీ బాధ్యతలు అప్పగింస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితీలో అంతర్గతంగా చర్చ జరుగుతోందంటున్నారు. మొత్తానికి చినబాబు తారక రామారావు సూపర్ ఎంట్రీకి రంగం సిద్దం అయ్యింది. ఇది ఇలా ఉండగా పార్టీలో అంచలంచలుగా ఎదుగుతున్న కె.తారక రామారావు తన సొంత నియోజకవర్గం సిరిసిల్లలో మాత్రం గడ్డు పరిస్థితిని ఎదురుకుంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే తారక రామారావు విజయం కోసం శ్రమించాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.