Begin typing your search above and press return to search.

కేటీఆర్‌ కు భారీ భారం...అన్నీ కీల‌క‌మే

By:  Tupaki Desk   |   15 Dec 2018 1:30 AM GMT
కేటీఆర్‌ కు భారీ భారం...అన్నీ కీల‌క‌మే
X
టీఆర్ ఎస్ పార్టీ అధినేత - తెలంగాణ సీఎం కేసీఆర్ సంచ‌ల‌న‌ - అనూహ్య నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ గా త‌న త‌న‌యుడు - ఎమ్మెల్యే కేటీఆర్ ను ఆయ‌న నియ‌మించారు. కీల‌క ద‌శ‌లో తీసుకున్న ఈ నిర్ణ‌యం అందరి దృష్టిని ఆక‌ర్షించింది. కాగా, తాజాగా జ‌రిగి టీఆర్ ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. అంతేకాకుండా కేటీఆర్‌ పై కీల‌క బాధ్య‌త‌లు పెట్టారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ గా ఎన్నికైన కేటీఆర్‌ ను అభినందిస్తూ కార్యవర్గం తీర్మానం చేసింది. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు - సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. పార్టీ - ప్రభుత్వం సమన్వయంతో కలిసి ముందుకు సాగాలన్నారు. వచ్చే ఐదేళ్లలో పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. అత్యాధునిక పరిజ్ఞానంతో జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాలు ఉండాలని - గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

శ‌నివారం నుంచే పార్టీ నాయకులు - కార్యకర్తలకు కేటీఆర్ అందుబాటులో ఉంటారని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. కేటీఆర్ పార్టీకి పూర్తిగా సమయం కేటాయిస్తారన్నారు. వచ్చే ఎన్నికలకు సమన్వయంతో ముందుకెళ్లాలన్నారు. మొదటగా పార్టీ సభ్యత్వ నమోదుపై దృష్టి పెట్టాలని తెలిపారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ పథకాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా వీటిని బలోపేతం చేయాలన్నారు. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఇంచార్జ్ నియామకం చేపట్టాలన్నారు. ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గానికి జనరల్ సెక్రటరీ - ఇద్దరు సెక్రటరీలను నియామకం జరగాలన్నారు. కార్యాలయాల్లో శాఖలవారీగా సమాచారం అందుబాటులో పెట్టుకోవాలని పేర్కొన్నారు. జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో 16 ఎంపీ స్థానాలు టీఆర్ ఎస్ పార్టీ గెలవాలని సీఎం అన్నారు. రాష్ట్ర కార్యవర్గంలో ఉన్నవారికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వనున్నట్లు తెలిపారు. శ‌నివారం ఒంటి గంటకు టీఆర్ ఎస్ రాష్ట్ర కార్యవర్గం మరోమారు భేటీ కానుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది.