Begin typing your search above and press return to search.

హ‌రీశ్‌ కు కేసీఆర్ ఇచ్చిన తాజా షాక్ ఇదే!!

By:  Tupaki Desk   |   22 Oct 2018 4:30 AM GMT
హ‌రీశ్‌ కు కేసీఆర్ ఇచ్చిన తాజా షాక్ ఇదే!!
X
టీఆర్ ఎస్ పార్టీ అధినేత‌ - తెలంగాణ అప‌ద్ధ‌ర్మ సీఎం కేసీఆర్ మ‌రోమారు త‌న మేన‌ల్లుడైన మంత్రి హ‌రీశ్‌ రావుకు ఊహించ‌ని షాకిచ్చారు. ఇటీవ‌లి కాలంలో వార‌స‌త్వ‌పోరు తారాస్థాయికి చేరింద‌ని - ఆ క్ర‌మంలో హ‌రీశ్ రావు వార్త‌ల‌ను త‌మ‌కు అనుకూలంగా ఉండే మీడియాలో రాకుండా చ‌క్రం తిప్పార‌నే వార్త‌లు తెర‌మీద‌కు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఈ ఎపిసోడ్ స‌ద్దుమ‌ణ‌గ‌డం గులాబీ ద‌ళ‌ప‌తి త‌న‌యుడు కేటీఆర్‌ - హ‌రీశ్‌ రావు క‌లిసి పలు కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్న నేప‌థ్యంలో టీఆర్ ఎస్‌ లో అంతా సెటిల్ అయిపోయింద‌ని భావించారు. అయితే, అలాంటిది లేద‌ని తాజాగా హ‌రీశ్‌ కు ఇచ్చిన మ‌రో షాక్ రూపంలో రుజువు అయింది.

జహీరాబాద్ - మలక్‌ పేట నియోజకవర్గాల నుంచి పార్టీ తరఫున పోటీచేసే అభ్యర్థులను టీఆర్‌ ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. జహీరాబాద్ నుంచి గతంలో పోటీ చేసిన మాణిక్‌ రావు - మలక్‌ పేట నుంచి చావా సతీశ్‌ కుమార్‌ ను ఖరారు చేస్తున్నట్టు తెలిపారు. రవాణాశాఖలో ఆర్టీవోగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన కొన్నింటి మాణిక్‌ రావు ఉద్యోగ విరమణ తర్వాత టీఆర్‌ ఎస్ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో టీఆర్‌ ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన మాణిక్‌ రావు.. సమీప కాంగ్రెస్ అభ్యర్థి జే గీతారెడ్డి చేతిలో కేవలం 842 ఓట్ల తేడాతో ఓడిపోయారు. తనకు మరోసారి అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఈ ఎపిసోడ్ చూసేందుకు చాలా సాదాసీదాగా క‌నిపిస్తున్న రెండో విడ‌త జాబితా రూపంలో హ‌రీశ్‌ కు కేసీఆర్ ఊహించ‌ని షాకిచ్చారు. హరీశ్‌ రావు న‌మ్మిన‌బంటు అయిన తెలంగాణ ఎస్సీ - ఎస్టీ క‌మిష‌న్ చైర్మ‌న్ ఎర్రోళ్ల శ్రీ‌నివాస్ జ‌హీరాబాద్ నుంచి పోటీ చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. అయితే, హ‌రీశ్‌ రావు టీంలో ఉండ‌టం త‌న టికెట్‌ కు ఇబ్బంది అవుతుందేమోన‌ని భావించి ఇటీవ‌ల మంత్రి కేటీఆర్‌ ను క‌లిసి త‌న ఆస‌క్తి వెల్ల‌డించారు. దీంతో ఆయ‌న‌కు టికెట్ ప‌క్కా అనుకున్నారు. కానీ, హ‌రీశ్ టీం మ‌నిషికి టికెట్ ఇవ్వ‌కుండా మ‌రో నాయ‌కుడికి గులాబీ ద‌ళ‌ప‌తి బెర్త్ ఖ‌రారు చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం.. ఈ రెండు స్థానాల్లో ఓట‌మి ప‌క్కా అన్న మాట వినిపిస్తోంది. ఇద్ద‌రూ బ‌ల‌హీన‌మైన అభ్య‌ర్థులేన‌ని చెబుతున్నారు. మ‌జ్లిస్ తో ఉండే స్నేహ‌ పూర్వ‌క పోటీలో.. బ‌ల‌హీన‌మైన అభ్య‌ర్థిని బ‌రిలో ఉంచ‌టం మామూలేన‌ని.. ఇందుకు త‌గ్గ‌ట్లే గ‌త ఎన్నిక‌ల్లో ఓట‌మిపాలైన చావ స‌తీష్ కుమార్‌ కు ఈసారీ టికెట్ ఇచ్చిన‌ట్లుగా చెబుతున్నారు.

ఇక‌.. జ‌హీరాబాద్ టికెట్ కోసం ఎస్సీ.. ఎస్టీ క‌మిష‌న్ ఛైర్మ‌న్ గా వ్య‌వ‌హ‌రించిన ఎర్రోళ్ల శ్రీ‌నివాస్ ప్ర‌య‌త్నించినా.. కేసీఆర్ మొగ్గు మాత్రం గ‌త ఎన్నిక‌ల్లో ఓట‌మి చెందిన టీఆర్ ఎస్ అభ్య‌ర్థి.. స్థానికుడైన మాణిక్ రావు పైనే మొగ్గు చూపారు. ఇన్నాళ్లు నాన్చి.. ఎలాంటి ప్ర‌త్యేక‌త లేని రీతిలో అభ్య‌ర్థుల్ని ఎంపిక చేసిన కేసీఆర్‌.. మిగిలిన ప‌ది మంది విష‌యంలో ఏం చేస్తారో చూడాలి.