Begin typing your search above and press return to search.

66 ఏళ్లే.. మరో రెండు సార్లు సీఎం నేనే: కేసీఆర్

By:  Tupaki Desk   |   15 Sep 2019 11:27 AM GMT
66 ఏళ్లే.. మరో రెండు సార్లు సీఎం నేనే: కేసీఆర్
X
కేసీఆర్ కు ఆరోగ్యం బాగాలేదని..త్వరలోనే కేసీఆర్ దిగిపోయి కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని జరుగుతున్న ప్రచారంపై తొలిసారి అసెంబ్లీలో కేసీఆర్ నోరు విప్పారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఈ మేరకు కేసీఆర్ హాట్ కామెంట్స్ చేశారు.

నాకు ఆరోగ్యం బాగా లేదని ప్రచారం చేస్తున్నారని.. కేటీఆర్ ను సీఎం చేస్తానని అంటున్నారని.. అదంతా ఉట్టి ప్రచారం మాత్రమేనని కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. మరో పదేళ్లు తెలంగాణలో టీఆర్ ఎస్ దే అధికారం అని.. నాకు ఇప్పుడు 66 ఏళ్లేనని.. మరో రెండు సార్లు పదేళ్లు సీఎంగా చేయలేనా అంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు.

తెలంగాణలో టీఆర్ ఎస్ కు, నాకు ఢోకానే లేదని ప్రతిపక్షాలు ఆశలు వదిలేసుకుంటే మంచిదంటూ కాంగ్రెస్ - బీజేపీలకు కేసీఆర్ చురకలంటించారు. ఇక యురేనియం తవ్వకాలనేవి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనివని.. ఇప్పటివరకు కేంద్రానికి అనుమతి ఇవ్వలేదని ఇక ఇవ్వమని ప్రజలకు హామీ ఇచ్చారు. సోమవారమే యురేనియం తవ్వకాలకు అనుమతి నిరాకరిస్తున్నట్టు సభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.

ఇలా తెలంగాణకు కాబోయే సీఎం కేటీఆర్ అన్న ఊహాగానాలకు అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ తెరదించారు. ఇక పదేళ్ల పాటు కేసీఆరే సీఎం అని.. కేటీఆర్ ను సీఎం చేస్తారన్న ప్రచారం వట్టిదేనని క్లారిటీ ఇచ్చేశారు.