Begin typing your search above and press return to search.

ముందస్తు వెనుక ఇదా కేసీఆర్ వ్యూహం....!!!

By:  Tupaki Desk   |   15 Aug 2018 1:30 AM GMT
ముందస్తు వెనుక ఇదా కేసీఆర్ వ్యూహం....!!!
X
తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రకటించడం వెనుక పెద్ద వ్యూహమే దాగి ఉందటున్నారు. డిసెంబరులో జరగనున్న నాలుగు రాష్ట్రాల శాసన సభ ఎన్నికలతో కలిపి తెలంగాణలో కూడా ఎన్నికలు జరపాలన్నది కేసీఆర్ ఎత్తుగడ. ఈ ఎన్నికలలో విజయం సాధించి అధికారంలోకి మరోసారి రావలనుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీతో సఖ్యంగా ఉన్నట్లు పైకి కనిపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. దీని వెనుక ఇక్కడ తమ కుమారున్ని ముఖ్యమంత్రిని చేయడం కేంద్రంలో తాను చక్రం తిప్పడం కె. చంద్రశేఖర రావు వ్యూహంగా కనిపిస్తోంది. సెప్టెంబర్ - అక్టోబర్ నెలలలో ఎన్నికలు నిర్వహించి అధికారంలోకి వచ్చిన తర్వాత లోక్‌సభ ఎన్నికల వరకూ కె. చంద్రశేఖర రావే ముఖ్యమంత్రి గా వ్యవహరిస్తారు. తెలంగాణలో తన పార్టీ గెలుపు నల్లేరు మీద నడకే అనుకుంటున్న కె. చంద్రశేఖర రావు లోక్‌ సభ ఎన్నికల సమయానికి జాతీయ స్దాయిలో ఫెడరల్ ఫ్రంట్ పై దృష్టి పెడతారు. ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఇతర పార్టీలను ఏకం చేసే పనిలో నిమగ్నమవుతారు. అన్నీ పార్టీలను ఏకం చేశాక - భారతీయ జనతా పార్టీ - కాంగ్రెస్‌ లను వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్‌‌ను ఏర్పాటు చేసే పనిలో పడతారు.

తెలంగాణ శాసనసభ ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన తర్వాత జాతీయ రాజకీయలపై దృష్టి కేంద్రీకరిస్తారు. అన్నీ పార్టీలను కలిపిన తర్వాత ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కొత్త రాజకీయ శక్తికి తెరతీస్తారు. ఈ సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రిగా తన కుమారుడు కల్వకుంట్ల తారక రామారావును తెరపైకి తీసుకు వస్తారని రాజకీయ వర్గాలలో జోరుగా చర్చ జరుగుతోంది. తన కుమారుడికి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టడం ఒకవైపు తాను జాతీయ స్దాయిలో చక్రం తిప్పడం మరోవైపు లక్ష్యంగా పెట్టుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేంద్రంలోను రాష్ట్రంలోను ఒకేసారి ఎన్నికలు జరిగితే తన పాచిక పారదని కేసీఆర్‌ ఉద్దేశంగా కనబడుతోంది. అలాగే తనయుడు కేటిఆర్‌ కు మేనల్లుడు హారీష్‌ రావుకు మధ్య ఎలాంటి వివాదాలు రాకుండా - గ్రూపులుగా చీలిపోకుండా మూడు నాలుగు నెలల పాటు తానే ముఖ‌్యమంత్రిగా వ్యవహరించి ఆ తర్వాత జాతీయ రాజకీయల వైపు వెళ్లలన్నది కే. చంద్రశేఖర రావు యోచన. దీని అమలు చేసి అటు జాతీయ స్థాయిలోను - ఇటు రాష్ట్రంలోను కూడా తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు భావిస్తున్నారు.