Begin typing your search above and press return to search.

ఏపీలో కేసీఆర్ ఫ్లెక్సీ వివాదం

By:  Tupaki Desk   |   14 Dec 2018 6:27 AM GMT
ఏపీలో కేసీఆర్ ఫ్లెక్సీ వివాదం
X
తెలంగాణలో అద్వితీయంగా గెలిచి సత్తా చాటిన సీఎం కేసీఆర్ కు ఏపీలోనూ శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఏపీలో తెలంగాణ సీఎం కేసీఆర్ కు మద్దతుగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదాస్పదమైంది. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం బస్టాండ్ వద్ద కేసీఆర్ బాహుబలి అంటూ ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ హైదరాబాద్ కు చెందిన సెటిలర్ సీహెచ్ చిన్నరెడ్డప్ప ధవేజీ - అతడి స్నేహితులు కలిసి ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీ జనాలను బాగా ఆకర్షించింది.

అయితే సడన్ గా కేసీఆర్ ఫ్లెక్సీని అనుమతి లేదంటూ పోలీసులు - మున్సిపల్ సిబ్బంది - ఇద్దరు టీడీపీ కౌన్సిలర్లు - ఆర్టీసీ డీఎం హఠాత్తుగా తొలగించారు. మిగిలిన ఫ్లెక్సీని అలాగే ఉంచి కేసీఆర్ ఫ్లెక్సీని తొలగించడం వివాదాస్పమైంది.

ఈ విషయమై కేసీఆర్ అభిమానులు ఎస్సైని కలువగా.. తాము ఫ్లెక్సీ తీయించలేదని ఎస్సై వివరణ ఇచ్చారు. మున్సిపల్ అధికారులు కూడా దీనిపై స్పందించలేదు. టీడీపీ పెద్దలే ఇలా చేయించి ఉంటారని.. మాయవతి సహా దేశంలోని ప్రముఖుల ఫ్లెక్సీలు పెట్టినప్పుడు తొలగించలేదని.. కేసీఆర్ ఫ్లెక్సీ నే ఎందుకు తొలగిస్తారని వారు ప్రశ్నించారు. కేసీఆర్ బాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్న మాటలను మనసులో పెట్టుకునే ఇలా చేసి ఉంటారని కేసీఆర్ అభిమానులు భావిస్తున్నారు. మున్సిపాలిటీ అనుమతి తీసుకొని మరోసారి ఏర్పాటు చేస్తామని కేసీఆర్ అభిమానులు పేర్కొన్నారు.