Begin typing your search above and press return to search.

నా వల్లే తెలంగాణ పన్నెండేళ్లు ఆలస్యం:కేసీఆర్

By:  Tupaki Desk   |   28 Aug 2015 4:31 AM GMT
నా వల్లే తెలంగాణ పన్నెండేళ్లు ఆలస్యం:కేసీఆర్
X
తెలంగాణ రాష్ర్ట సాధ‌న కోసం డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌వి వ‌దిలేసి, టీఆర్ ఎస్‌ ను స్థాపించి ఉద్య‌మ బాట‌లో ముందుకుసాగి స్వ‌రాష్ర్ట కాంక్ష‌ను సాకారం చేసుకున్న ప్ర‌స్తుత తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తెలంగాణ ఏర్పాటుకావ‌ద్ద‌ని కోరుకున్నారా? ఒకవేళ తెలంగాణ ఏర్ప‌డితే తాను అనుకున్న విధంగా ఉండాల‌ని ఆయ‌న భావించారా అంటే అవున‌నే అంటున్నారు. అది కూడా స్వ‌యంగా కేసీఆర్ ప్ర‌క‌టించారు.

హైద‌రాబాద్‌ కు చెందిన వివిధ అంశాల‌పై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సచివాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల‌తో స‌మీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో హైదరాబాద్ గురించే చర్చ జరిగిందని అన్నారు. హైదరాబాద్ లేకుండా తెలంగాణ ఇవ్వడానికి అభ్యంతరం లేదని ఆంధ్ర నాయకత్వం కూడా అంగీకరించిందని చెప్పుకొచ్చారు. కానీ తాను ఒప్పుకోలేదని, హైదరాబాద్ విషయంలో రాజీపడేది లేదని చెప్పిన‌ట్లు వివ‌రించారు.

హైదరాబాద్ లేని తెలంగాణ కావాలంటే 12 ఏళ్ల క్రితమే రాష్ర్టం ఏర్ప‌డేద‌ని... కానీ హైదరాబాద్‌ తో కూడిన తెలంగాణ కావాలని పోరాటం చేశామ‌ని వివ‌రించారు. ఆలస్యం జరిగినా అనుకున్నది సాధించామ‌ని...చావు మీదికి తెచ్చుకుని మరీ గుండెకాయలాంటి హైదరాబాద్‌ ను దక్కించుకున్నామ‌ని ముఖ్యమంత్రి చెప్పారు. హైదరాబాద్‌ తోపాటు మనకు వారసత్వంగా ద‌క్కించని ఆ స‌మావేశంలోని ప్ర‌తినిధుల‌తో చెప్పారు. హైదరాబాద్‌ ను ఆంధ్రపాలకులు మనది అని అనుకోలేదని అందుకే... గత పాలకులు అనుసరించిన విధానాల పాపాలు కూడా హైద‌రాబాద్‌ తోటే వచ్చాయని ఈ సందర్భంగా కేసీఆర్ పేర్కొన్నారు.