Begin typing your search above and press return to search.

ఇవాంకాతో ఎంపీ క‌విత స్పెష‌ల్ డిన్న‌ర్‌

By:  Tupaki Desk   |   24 Nov 2017 4:40 AM GMT
ఇవాంకాతో ఎంపీ క‌విత స్పెష‌ల్ డిన్న‌ర్‌
X
అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ త‌న‌య ఇవాంకా ట్రంప్ హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న ఇప్ప‌టికే అనేక విశేషాల‌కు, ప్ర‌త్యేక‌త‌ల‌కు వేదిక‌గా మారుతుండ‌గా...మ‌రో కీల‌క స‌మావేశానికి అగ్ర‌రాజ్యాధిప‌తి త‌న‌య హాజ‌రుకానున్న‌ట్లు స‌మాచారం. హైద‌రాబాద్‌కు తొలిసారిగా వ‌స్తున్న ఇవాంకాను ఆతిథ్యంతో ముంచెత్తేందుకు ఇప్ప‌టికే తెలంగాణ ప్ర‌భుత్వం అన్ని ఏర్పాట్లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో మ‌రో ప్ర‌త్యేక గిఫ్ట్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్ త‌న‌య‌, నిజామాబాద్ ఎంపీ క‌విత ఫిదా చేయ‌నున్నార‌ని తెలుస్తోంది.

విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం...తెలంగాణ‌కు మొద‌టిసారి వ‌స్తున్న సంద‌ర్భంగా అద్భుత‌మైన ఆహ్వానం, ఆత్మీయ ఆతిథ్యం ఇవ్వాల‌ని టీఆర్ఎస్ ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా హెచ్ఐసీసీలో అడుగుపెడుతున్న సంద‌ర్భంగా ఇవాంకాకు తెలంగాణ‌కు మాత్ర‌మే ప్ర‌త్యేక‌మైన బ‌తుక‌మ్మ‌ల‌తో స్వాగ‌తం ప‌ల‌క‌నున్న‌ట్లు తెలుస్తోంది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌య క‌విత స‌హా ప‌లువురు మ‌హిళ‌లతో ఈ ఆత్మీయ స్వాగ‌తం ఉండ‌నున్న‌ట్లు స‌మాచారం. దీంతోపాటుగా ఇవాంకాతో ఎంపీ క‌విత ప్ర‌త్యేక స‌మావేశం ఉండ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

ఫ‌ల‌క్‌నుమాలో జ‌రిగే విందులో ఇవాంకాతో సీఎం కేసీఆర్ త‌న‌య ఎంపీ క‌విత ప్ర‌త్యేకంగా భేటీ అవ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ మేర‌కు అధికారులు అపాయింట్‌మెంట్ సిద్ధం చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ సంద‌ర్భంగా ప్ర‌త్యేక డిన్న‌ర్ ఏర్పాట్లు చేసిన‌ట్లు తెలుస్తోంది. కాగా ఈ డిన్న‌ర్ అనంత‌రం ప్ర‌త్యేకంగా రూపొందించిన గిఫ్ట్‌ను ఎంపీ క‌విత ఇవాంకాకు బ‌హుక‌రించనున్న‌ట్లు స‌మాచారం. ఈ మేర‌కు ప్ర‌త్యేకంగా సిద్ధం చేసిన‌ట్లు తెలుస్తోంది.