తెలంగాణ కేబినెట్.. కొత్తమంత్రులు వీరే..

Tue Feb 19 2019 10:25:42 GMT+0530 (IST)

తెలంగాణ ప్రభుత్వం కొలువుదీరిన రెండు నెలల తర్వాత కేబినెట్ విస్తరణకు ముఖ్యమంత్రి కేసీఆర్ పూనుకున్నారు. మొదట ముఖ్యమంత్రిగా కేసీఆర్.. హోంమంత్రిగా మహమూద్ అలీ మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటినుంచి ఇద్దరే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు.తాజాగా ఈరోజు 10 మందితో తెలంగాణ కేబినెట్ ను కేసీఆర్ విస్తరిస్తున్నారు. గవర్నర్ నరసింహన్ చేత రాజ్ భవన్ లో ఈ ఉదయం 11.30 గంటలకు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.  ఈ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం.. సీఎం కేసీఆర్ కేబినెట్ విస్తరణను పాత - కొత్త ముఖాల కలయికతో నింపుతున్నారు. పోయినసారి కేబినెట్ లో మంత్రులుగా చేసిన నలుగురితోపాటు ఆరుగురు కొత్తవారికి ఈ దఫా కేబినెట్ లోకి తీసుకుంటున్నారు. ఇందులో సీనియర్లు - జూనియర్లు కలిసి ఉండడం విశేషంగా చెప్పవచ్చు. ఈ సుధీర్ఘ కేబినెట్ కసరత్తులో కేసీఆర్ తెలంగాణ సామాజిక కుల - వర్గ - ప్రాంత - జిల్లా రాజకీయ సమీకరణాలన్నింటిని బేరీజు వేసుకొని కేబినెట్ ను విస్తరిస్తున్నారు.

తాజాగా 10 మందికి తెలంగాణ సీఎంవో నుంచి అధికారికంగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయాలని ఆదేశాలు వచ్చాయి.. ఆ 10 మంది వీరే..

1. కొప్పుల ఈశ్వర్
2.జగదీశ్వర్ రెడ్డి
3. నిరంజన్ రెడ్డి
4.ప్రశాంత్ రెడ్డి
5.ఎర్రబెల్లి దయాకర్ రావు
6. మల్లారెడ్డి
7. ఇంద్రకరణ్ రెడ్డి
8. ఈటెల రాజేందర్
9. తలసాని శ్రీనివాస్ యాదవ్
10. శ్రీనివాస్ గౌడ్

ఈ పది మందిలో గడిచిన తెలంగాణ తొలి కేబినెట్ లోనూ మంత్రులుగా ఈటెల - తలసాని - జగదీశ్ రెడ్డి - ఇంద్రకరణ్ రెడ్డిలు కొనసాగారు.  ఇక మిగిలిన ఆరుగురు ఈసారి కొత్త వారే.. అయితే ఆశ్చర్యకరంగా తొలి కేబినెట్ విస్తరణలో కేసీఆర్ కుటుంబ సభ్యులైన కేటీఆర్ - హరీష్ రావులకు చోటు దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇక మహిళలకు కూడా తొలి విస్తరణలో చోటు దక్కకపోవడం గమనార్హం.