పాల్ కాళ్లు పట్టుకుంది నిజమే కాని : వర్మ

Mon Jan 21 2019 19:36:26 GMT+0530 (IST)

ఇటీవల ఒక ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేఏ పాల్ మాట్లాడుతూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన కాళ్లు పట్టుకున్నాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మామూలుగా ఎంత పెద్ద వారికి అయినా కూడా కనీసం వంగి నమస్కారం కూడా పెట్టని వర్మ నిజంగానే పాల్ కాళ్లు పట్టుకున్నాడా ఆయన ఆశీర్వాదం తీసుకున్నాడా అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ సమయంలోనే సదరు మీడియా ఛానెల్ నేరుగా వర్మ దగ్గరకు వెళ్లగా ఆయన అసలు విషయం చెప్పకుండా డొంక తిరుగుడు మాటలతో మాయ చేసే ప్రయత్నం చేశాడు.కేఏ పాల్ కాళ్లు పట్టుకున్న మాట నిజమే కాని ఆయన్ను కాళ్లు పట్టుకుని కిందకు లాగేందుకు ప్రయత్నించాను కాళ్లు పట్టుకుని కిందకు లాగితే అతడి తల ఏమైనా సరి అవుతుందేమోననే ఉద్దేశ్యంతో కాళ్లు పట్టుకున్నాను. లాగబోయే సమయంలో ఆయన ఫ్రెండ్ ఏసు ప్రభును వెంటేసుకుని వచ్చి నన్నేమైనా చేస్తాడేమో అని భయపడి కాళ్లు లాగకుండా వదిలేశానంటూ వర్మ చెప్పుకొచ్చాడు. గతంలో తన వద్ద పాల్ మాట్లాడుతూ అమితాబచ్చన్ చావు బతుకుల్లో ఉన్న సమయంలో నేను ప్రార్థన చేసి కాపాడాను. నన్ను చంద్రబాబు నాయుడు ప్రత్యేక విమానంలో అమితాబచ్చన్ వద్దకు తీసుకు వెళ్లారంటూ పాల్ నాతో చెప్పాడు.

నాకు అమితాబ్ గారితో ఉన్న చనువుతో ఆయనకు మీకు కేఏ పాల్ ఎవరో తెలుసా అంటూ మెసేజ్ పెట్టాను. అప్పుడు ఆ పేరు ఎప్పుడు వినలేదని చెప్పాడు. అలా ఫూలిష్ గా అబద్దాలు చెప్పే పాల్ గురించి మాట్లాడటమే వృదా అంటూ వర్మ కామెంట్ చేశాడు. కేఏ పాల్ కు దమ్ముంటే తనకు తెలుసు అంటూ చెబుతున్న వారిని వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి క్యాంపెయినింగ్ కు తీసుకు రావాలని సవాల్ విసిరాడు.