Begin typing your search above and press return to search.

జయలలిత కొడుకు ను అరెస్టు చేయండి

By:  Tupaki Desk   |   27 March 2017 1:00 PM GMT
జయలలిత కొడుకు ను అరెస్టు చేయండి
X
అన్నాడీఎంకే అధినేత్రి - అత‌మిళ‌నాడు దివంగ‌త సీఎం జ‌య‌ల‌లిత కుమారున్ని అని చెప్పుకుంటున్న జే.కృష్ణ‌మూర్తికి దిమ్మ‌తిరిగే షాక్ త‌గిలింది. కృష్ణ‌మూర్తిని అరెస్టు చేయాలంటూ ఆ రాష్ట్ర‌ హైకోర్టు ఇవాళ పోలీసుల‌కు ఆదేశాలు జారీ చేసింది. సినీ న‌టుడు శోభ‌న్‌ బాబు - జ‌య‌ల‌లిత దంప‌తుల‌కు పుట్టిన‌ట్లు కృష్ణ‌మూర్తి ఇచ్చిన డాక్యుమెంట్లు ఫోర్జ‌రీవ‌ని హైకోర్టుకు పోలీసులు తెలియ‌జేశారు. దీంతో కృష్ణ‌మూర్తిని అరెస్టు చేయాల‌ని కోర్టు ఆదేశించింది.

త‌మిళ‌నాడులోని ఈరోడ్‌ కు చెందిన కృష్ణమూర్తి దివంగ‌త సీఎం జ‌య‌ల‌లిత‌ - సినీన‌టుడు శోభ‌న్ బాబుకు పుట్టిన సంతానం తానేనని ప్ర‌క‌టించుకున్నాడు. 1985లో తాను జయలలితకు జన్మించానని, ఆ మరుసటి సంవత్సరం తనను ఈరోడ్‌కు చెందిన వసంతమణికి దత్తత ఇచ్చారని కృష్ణమూర్తి తెలిపాడు. ద‌త్తత పత్రంపై త‌న త‌ల్లిదండ్రులైన జయలలిత-శోభన్ బాబుతో పాటు ద‌త్త‌త తీసుకున్న వసంతమణి ఫొటోలు, సంతకాలు ఉన్నాయని, మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ సాక్షిగా సంతకం చేశారని వెల్లడించాడు. ఈ నేప‌థ్యంలో జ‌య‌ల‌లిత ఆస్తులు త‌న‌కే ద‌క్కాల‌ని కోర్టును ఆశ్ర‌యించాడు. ఈ పిటిష‌న్ విచార‌ణ‌కు వ‌చ్చిన సంద‌ర్భంగా హైకోర్టు న్యాయ‌మూర్తి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లు ఒరిజనల్‌ కాదని, తప్పుడు పత్రాలు సృష్టించాడని తెలిపారు. అందుబాటులో ఉన్న ప్రముఖుల ఫొటోను ప‌త్రాల‌పై అతికించి తప్పుడు పత్రాలు సృష్టించి కోర్టుతో ఆటలు ఆడుకునే ప్ర‌య‌త్నం చేశారు అని జస్టిస్ ఆర్ మహదేవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కృష్ణ‌మూర్తి మ‌ర్పించిన ప‌త్రాలు చిన్న పిల్ల‌లు సైతం గుర్తు ప‌డతార‌ని పేర్కొంటూ ఇలా న్యాయ‌స్థానం స‌మ‌యం వృదా చేసిన కృష్ణ‌మూర్తి అందించిన ప‌త్రాల‌ను ప‌రిశీలించి అందులో నిజాల‌ను నిగ్గుతేల్చాల‌ని న్యాయ‌మూర్తి పోలీసులను ఆదేశించారు. అకోర్టు ఆదేశాల‌తోనే ప్ర‌స్తుతం పోలీసులు వివ‌రాలు అందించారు. గ‌త వారం విచార‌ణ సంద‌ర్భంగా కృష్ణమూర్తికి మద్దతుగా కోర్టుకు వచ్చిన సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామిని న్యాయమూర్తి మందలించారు. ఇందులో మీ పాత్ర ఏమిటి? ఇందులో ఎందుకు భాగ‌స్వామ్యం పంచుకున్నారు అంటూ ఆయ‌న‌పై ప్ర‌శ్న‌ల వ‌ర్షం గుప్పించారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/