Begin typing your search above and press return to search.

జెట్ ఎయిర్‌ వేస్ పైల‌ట్ ఎంత ప‌ని చేశాడంటే!

By:  Tupaki Desk   |   24 Oct 2016 2:05 PM GMT
జెట్ ఎయిర్‌ వేస్ పైల‌ట్ ఎంత ప‌ని చేశాడంటే!
X
ఈ ఘ‌ట‌న తెలుసుకుంటే... జెట్ ఎయిర్‌ వేస్‌ కు చెందిన విమానాల్లో ప్ర‌యాణించాలంటేనే జ‌డుసుకుని చావాల్సిందే. ఎందుకంటే ఆ ఎయిర్‌ వేస్‌ కు చెందిన ఓ పైల‌ట్... విమానాన్ని ల్యాండింగ్ చేస్తున్న సంద‌ర్భంగా ఏ ఒక్క‌రూ చేయ‌ని దుస్సాహ‌సం చేశాడు. అయితే పెద్ద ప్ర‌మాద‌మేమీ చోటుచేసుకోలేదు కాబ‌ట్టి స‌రిపోయింది కాని... ప్ర‌మాద‌మే జ‌రిగి ఉంటే... వంద‌కు పైగా జ‌నం ప్రాణాలు కోల్పోయేవారు. తిరువ‌నంత‌పురం ఎయిర్‌ పోర్టులోనే కాకుండా దేశీయ విమానాశ్ర‌యాల్లో అంత‌టి ప్ర‌మాదం మరొక‌టి ఉండేది కాదు. గ‌తేడాది ఆగ‌స్టు 17న కేర‌ళ‌లోని తిరువ‌నంత‌పురం ఎయిర్‌ పోర్టులో జ‌రిగిన ఈ ప్ర‌మాదంపై డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ సివిల్ ఏవియేష‌న్ (డీజీసీఏ) స‌మ‌గ్ర ద‌ర్యాప్తు చేసింది. నివేదిక‌ను ప్ర‌భుత్వానికి అంద‌జేసింది. ఈ నివేదిక‌లో డీజీసీఏ ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. అయినా స‌ద‌రు ప్ర‌మాదానికి సంబంధించిన వివ‌రాలు చెప్ప‌కుండా ఈ ఉపోద్ఘాత‌మేంట‌నేగా మీ డౌటు?

అస‌లు విష‌యంలోకి వెళితే... గ‌తేడాది ఆగ‌స్టు 17 జెట్ ఎయిర్ వేస్ కు చెందిన బోయింగ్ 737 విమానం దోహా నుంచి కొచ్చికి బ‌య‌లుదేరింది. దోహాలో టేకాఫ్ తీసుకున్న స‌ద‌రు విమానాన్ని పైలట్ - కో-పైల‌ట్ సుర‌క్షితంగానే కొచ్చికి చేర్చారు. అయితే వాతావ‌ర‌ణం అనుకూలించ‌ని కార‌ణంగా విమానం ల్యాండింగ్ సాధ్య‌ప‌డ‌లేదు. కింద‌కు దిగిన‌ట్టే దిగిన విమానం తిరిగి మ‌ళ్లీ ఆకాశం వైపు దూసుకెళ్లింది. ర‌న్ వే క‌నిపించ‌ని కార‌ణంగానే పైల‌ట్ స‌ద‌రు విమానాన్ని ల్యాండింగ్ కోసం కింద‌కు దించినా... తిరిగి పైకి లేపాడు. ఇలా ఒక‌టి కాదు... రెండు కాదు... ఏకంగా ఆరుసార్లు ఆ పైల‌ట్ చేసిన ల్యాండింగ్ య‌త్నాలు విఫ‌ల‌మ‌య్యాయి. ఈలోగా విమానంలోని ఇంధ‌నం అంత‌కంతకూ త‌రుగుతూ వ‌చ్చింది. ఏడోసారి ల్యాండింగ్ య‌త్నం విఫ‌ల‌మైతే... విమానంలోని ఇంధ‌నం పూర్తిగా అయిపోతుంద‌ట‌. విష‌యాన్ని గ్ర‌హించిన పైల‌ట్ క‌ళ్లు మూసుకుని తిరువ‌నంత‌పురం ఎయిర్‌ పోర్లు ర‌న్‌ వేపై విమానాన్ని దించేశాడు.

దేవుడి ద‌య వ‌ల్ల ఈ ఘ‌ట‌న‌లో పెద్ద ప్ర‌మాద‌మేమీ సంభివించ‌లేదు. అయితే ఆరు సార్లు ల్యాండింగ్ య‌త్నాలు విఫ‌లం కావ‌డం, చివ‌ర‌గా ఏడో య‌త్నంలో పైల‌ట్ గుడ్డిగా విమానాన్ని దించేయ‌డంపై డీజీసీఏ షాక్‌ కు గురైంది. వెనువెంట‌నే స‌మ‌గ్ర ద‌ర్యాప్తున‌కు ఆదేశాలు జారీ చేసింది. తొలిసారి ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ కోసం యత్నించిన‌ప్పుడు... విమానంలో 4,844 కేజీల ఇంధ‌నం ఉండ‌గా - ఏడో ల్యాండింగ్ య‌త్నానికి ముందు ఆ ఇంధ‌నం కాస్తా... 349 కేజీల‌కు ప‌డిపోయింది. ఇదే విష‌యాన్ని గ్ర‌హించిన పైల‌ట్... త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లోనే ర‌న్‌ వే స్ప‌ష్టంగా క‌నిపించ‌కున్నా విమానాన్ని దించేశాడ‌ట‌. అంతేకాకుండా విమానాన్ని ల్యాండింగ్ చేస్తున్న స‌మ‌యంలో ప‌రిస్థితిని గ‌మ‌నించిన క‌మాండ‌ర్ ఒక‌రు... ''ర‌న్ వే ఎక్క‌డుందో తెలుసా?'' అన్న ప్రశ్న‌కు... పైల‌ట్ ఇచ్చిన స‌మాధానం కూడా తీవ్ర భ‌యాందోళ‌న‌కు గురిచేసేలానే ఉంది. ''గుడ్డిగా దించేస్తున్నా (జ‌స్ట్ గోయింగ్ బ్లైండ్లీ)'' అంటూ కాక్ పిట్ లోని పైల‌ట్ చెబితే ఆందోళ‌న‌కు గురి కావ‌డ‌మేమిటి? పై ప్రాణాలు పైనే పోతాయిగా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/