Begin typing your search above and press return to search.

ఆమెకు ట్రంప్ వేల డాలర్ల ఆఫర్ చేశారంట!

By:  Tupaki Desk   |   23 Oct 2016 9:31 AM GMT
ఆమెకు ట్రంప్ వేల డాలర్ల ఆఫర్ చేశారంట!
X
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై వస్తోన్న లైంగిక ఆరోపణల్లో మరో కొత్త అంశం కలిసింది. ఇప్పటికే ట్రంప్ కు వ్యతిరేకంగా ఆరోపణలు గుప్పిస్తున్న మహిళల సంఖ్య రోజురోజుకు పెరుగుతోన్న క్రమంలో ఆ లిస్ట్ లో తాజాగా శృంగార చిత్రాల నటి జెసికా డ్రాకే వచ్చి చేరారు. ట్రంప్ తో తనకున్న అనుభవాన్ని మీడియా ముందు బయటపెట్టిన జెసికా... తన పట్ల ట్రంప్ అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా, తనతో ఏకాంతంగా గడపాలని కూడా ఒత్తిడి చేశారని ఆరోపించింది. ప్రముఖ న్యాయవాది గ్లోరియా ఆల్డ్రెడ్ తో కలిసి ఆమె ఈ విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి ట్రంప్ పై సరికొత్త ఆరోపణలు చేశారు.

కాలిఫ్నోరియాలోని లేక్ టాహోయ్ గోల్ఫ్‌ టోర్నమెంట్ లో 2006లో తనకు ట్రంప్ పరిచమయ్యారని మొదలుపెట్టిన జెసికా... ఆ పరిచయం తర్వాత ట్రంప్ ఆహ్వానం మేరకు మరో ఇద్దరు మహిళలతో ఆయన హోటల్ గదికి వెళ్లానని వెల్లడించారు. "మేము ఆయన గదికి వెళ్లేసరికి ట్రంప్ పైజామా దస్తుల్లో ఉన్నారు.. మమ్మల్ని చూసి దగ్గరికి వచ్చి ఒక్కొక్కరినీ గట్టిగా కౌగిలించుకున్నారు.. అనంతరం మా అనుమతి లేకుండానే ముద్దు పెట్టుకున్నారు" అని జెసికా తెలిపారు. అనంతరం తమతో పోర్నోగ్రఫీ గురించి కూడా మాట్లాడారని చెప్పింది. తర్వాత ఆమె తన గదికి తిరిగొచ్చాక ఫోన్ చేసిన ట్రంప్... తన హోటల్ గదికి రావాలని మరోసారి ఆహ్వానించారట. పార్టీకి రావాలని, అలా వస్తే ఎంతకావాలన్నా ఇస్తానని అన్నారని తెలిపిన జెసికా, ఆ ప్రతిపాదనకు ఎప్పటికీ ఒప్పుకోకపోయేసరికి ట్రంప్ లేదా ఆయన తరపు వ్యక్తి తనకు 10 వేల డాలర్లు ఆఫర్ చేశారని చెప్పింది. ట్రంప్ నుంచి వచ్చిన ఈ ఆఫర్ కి ఒప్పుకుంటే తన వ్యక్తిగత విమానంలో ట్రంప్ తన ఇంటి నుంచి లాస్ ఏంజెలెస్ తీసుకెళతానన్నాడని జెసికా వివరించింది.

ఈ రేంజ్లో ట్రంప్ పై రోజు రోజు కీ మహిళల నుంచి ఆరోపణలు పెరిగిపోతున్నాయి. కాగా ఈ ఆరోపణలపై స్పందించిన ట్రంప్ ప్రచార బృందం ఈ విషయాలను తోసిపుచ్చింది. కేవలం బురద చల్లేందుకు హిల్లరీ వర్గం ట్రంప్ పై ఇలాంటి ప్రయత్నాలు చేస్తోందని, అందులో ఇదీ ఒకటని చెప్పింది!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/