Begin typing your search above and press return to search.

‘‘ఫైర్ బ్రాండ్’’ది ఐరెన్ లెగ్గా..?

By:  Tupaki Desk   |   12 Feb 2016 3:54 AM GMT
‘‘ఫైర్ బ్రాండ్’’ది ఐరెన్ లెగ్గా..?
X
తెలంగాణ అధికారపక్షం నేతలంతా ఇప్పుడు మాంచి దూకుడుతనాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రత్యర్థిపై పట్టు చిక్కినప్పుడే చితక్కొట్టేసి.. మళ్లీ పైకి లేవకుండా చేసే వ్యూహాం తరహాలో తమ్ముళ్లపై గులాబీ దండు విరుచుకుపడుతోంది. ఓపక్క ఆపరేషన్ ఆకర్ష్ తో టీటీడీపీ మూలాల్ని గులాబీ బాస్ కదిలించి వేస్తుంటే.. ఇంకోవైపు గులాబీ నేతలు తమకు చేతనైనంతగా టీటీడీపీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా టీటీడీపీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డిపై టీఆర్ ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాటలే ఇందుకు నిదర్శనం.

ఎర్రబెల్లి కారెక్కేసిన తాజా పరిస్థితుల్లో ఆయన స్థానంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష నేతగా రేవంత్ ను ఎంపిక చేయటం తెలిసిందే. ఈ నియమకంపై టీఆర్ ఎస్ నేతలు విరుచుకుపడుతున్నారు. రేవంత్ రెడ్డిది ఐరెన్ లెగ్ గా అభివర్ణిస్తూ జీవన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీలోకి మరో ఇద్దరు టీటీడీపీ ఎమ్మెల్యేలు చేరతారని.. రేవంత్ లాంటోళ్లు మిగిలిపోతారని.. అలాంటి వారి వల్ల వచ్చేది.. పోయేది ఏమీ ఉండదని తేల్చేశారు. చూస్తుంటే.. పార్టీలోకి వచ్చేటోళ్లు ఓకే.. రానోళ్లంతా ఐరెన్ లెగ్ లని తేల్చేటట్లున్నారే..?