Begin typing your search above and press return to search.

జ‌య‌ప్ర‌ద‌... పార్టీ మారుతుందా?

By:  Tupaki Desk   |   25 March 2019 12:17 PM GMT
జ‌య‌ప్ర‌ద‌... పార్టీ మారుతుందా?
X
ఒక తెలుగు న‌టి... యూపీలో ఎంపీ అయ్యింది. అది కూడా 2004లోనే గెలిచింది. ఇది బాలీవుడ్ ఎఫెక్ట్‌. 2004 నుంచి 2014 వరకు రాంపూర్ నియోజకవర్గం (ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌) నుంచి ఎస్పీ తరపున జయప్రద ఎంపీగా అప్ర‌తిహ‌తంగా కొనసాగారు. అయితే... ఎపుడైతే పార్టీ ములాయం నుంచి అఖిలేష్ చేతికి వ‌చ్చిందో అప్ప‌ట్నుంచి ఆ పార్టీలోని కీల‌క నేత అమ‌ర్‌సింగ్ హ‌వా త‌గ్గింది. ఆయ‌న‌కు స‌న్నిహితురాల‌యిన జ‌య‌ప్ర‌ద హ‌వా కూడా త‌గ్గింది. దీంతో వారిద్ద‌రూ ఆ పార్టీలోంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఆ త‌ర్వాత గ‌త ఏడాది ఆమె రాజ‌కీయాల్లో క్రియాశీల‌క పాత్ర పోషించ‌లేదు. ఎక్క‌డా పోటీ చేయ‌లేదు.

తాజాగా జ‌య‌ప్ర‌ద గురించి ఒక వార్త వినిపిస్తోంది. ఆమె బీజేపీలో చేర‌తారని తెలుస్తోంది. దీనికి ఆల్రెడీ ముహూర్తం కూడా ఫిక్స‌యిపోయింద‌ట‌. ఈరోజు లేదా రేపు అమిత్ షా సమక్షంలో పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తోన్నాయి. ఇపుడు మ‌ళ్లీ అదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీచేయాల‌ని ఆమె ఆకాంక్షిస్తున్నారు. బీజేపీ త‌ర‌ఫున పోటీచేసి త‌న ప్ర‌త్య‌ర్థి, చిర‌కాల శ‌త్రువు అయిన‌ ఆజంఖాన్ ను ఓడించాల‌ని ఆమె ప‌ట్టుద‌లగా ఉన్నారు. ఆజంఖాన్‌ పై ఆమె గతంలో ప‌లు ఆరోప‌ణ‌లు చేశారు. ఆజంఖాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ లాంటివాడ‌ని ఆమె గ‌తంలో వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉండ‌గా... ఆమె రాజ‌కీయ అరంగేట్రం చేసింది టీడీపీ నుంచే. గ‌త ఎన్నిక‌ల్లో ఆమె టీడీపీలో చేర‌తార‌ని వార్త‌లు వ‌చ్చినా అవి నిజం కాలేదు. చివ‌ర‌కు మ‌ళ్లీ మోడీ ఆధ్వ‌ర్యంలో మ‌ళ్లీ ప‌ద‌వి చేప‌ట్టాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్నారు.