Begin typing your search above and press return to search.

మోడీ భార్య.. పట్టువదలని విక్రమార్కురాలే

By:  Tupaki Desk   |   11 Feb 2016 9:52 AM GMT
మోడీ భార్య.. పట్టువదలని విక్రమార్కురాలే
X
ప్రధాని నరేంద్రమోడీ పాస్‌ పోర్టు వివరాలను తెలియజేయాల్సిందిగా ఆయన భార్య యశోదాబెన్‌ అహ్మదాబాద్ పాస్‌ పోర్టు కార్యాలయంలో ఆర్ టీఐ కింద దరఖాస్తు చేశారు. మోడీ ముఖ్యమంత్రిగా పని చేస్తున్న కాలంలో పాస్‌ పోర్టు పొందడానికి తన వివాహ సంబంధ పత్రాలను దాఖలు చేశారా అనే విషయమై ఆమె ఆర్ టీఐ కింద తెలుసుకోగోరారు. యశోదాబెన్‌ పాస్‌ పోర్టు కోసం చేసుకున్న దరఖాస్తును గత నవంబర్‌ లో పాస్‌ పోర్టు కార్యాలయం తిరస్కరించింది. ఈ సందర్భంగా యశోదాబెన్‌ తన మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ ను కానీ, మోడీతో వివాహమైనట్లు తెలియజేసే జాయింట్‌ అఫిడవిట్‌ ను కాని సమర్పించలేదంటూ కార్యాలయం పేర్కొంది. దీంతో యశోదాబెన్ తాను మోడీ భార్యను అని నిరూపించుకునేందుకు ఈ తాజా ప్రయత్నం చేశారు. ఆయన తన పాస్ పోర్టులో కనుక యశోదను భార్యగా చూపితే ఆమె పాస్ పోర్టుకు ఇబ్బందులు తొలగుతాయి.

కాగా యశోదాబెన్‌ తమ కార్యాలయానికి వచ్చి ఆర్టీఐ దరఖాస్తును దాఖలు చేశారని, ఆమెకు తాము త్వరలో సమాధానం ఇస్తామని రీజనల్‌ పాస్‌ పోర్ట్‌ ఆఫీసు వర్గాలు చెబుతున్నాయి. అయినా... యశోదాబెన్ ఒక్క పాస్ పోర్టు కోసం ఇన్ని ఇబ్బందులు పడుతున్నప్పుడు అదేదో వచ్చేలా చేస్తే మోడీ సొమ్మేం పోతుందని అంటున్నారు కొందరు. కాదుకాదు... ఆమెకు పాస్ పోర్టు వస్తే మోడీ అధికారిక పర్యటనల్లో ఆయనతో సహా వెళ్తానంటుందేమో అని ఆయన భయపడుతున్నారన్న వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి. ఇదంతా ఎలా ఉన్నా పాపం... యశోద మాత్రం సమాచారహక్కు దరఖాస్తులు ఇస్తూ సహ చట్టం కార్యకర్తలా మారిపోయారు చివరికి. మోడీ ముందు సహ చట్టం ఏం పనిచేస్తుందీ?