పవన్ పార్టీ ఇంత వేగంగా సిద్ధమవుతోంది

Fri Oct 13 2017 19:57:42 GMT+0530 (IST)

జనసేన పార్టీ అధినేత - పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన పార్టీని దూకుడుగా ముందుకు తీసుకుపోయేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీలో తనతో కలిసి వచ్చే జనసైనికులను ఇప్పటికే తెలంగాణ - కోస్తాంధ్ర - సీమలో ఎంపిక చేసిన జనసేనాని...ఇప్పుడు రాష్ట్రస్థాయి కార్యాలయంపై దృష్టి సారించింది. ఇందుకోసం కీలకమైన పనులను పార్టీ పూర్తి చేస్తోంది. హైదరాబాద్ లోని జనసేన పరిపాలన కార్యాలయంలో అదనపు హంగుల ఏర్పాటు చురుకుగా జరుగుతున్నాయని ఆ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో పనులు చురకుగా సాగుతున్నాయని జనసేన పత్రికా ప్రకటన తెలిపింది. పార్టీ అడ్మినిస్ట్రేటివ్ విభాగాలన్నీ ఇక ఇక్కడ నుంచే సేవలు అందించనున్నాయని వివరించింది. ముఖ్యంగా ఐటీ విభాగాన్ని విస్తృత పరుస్తున్నారని వివరించింది. మరో కొద్దీ రోజులలో ఈ పనులన్నీ ముగియనున్నాయని తెలిపింది. దాదాపుగా ఈ నెలలో పనులన్నీ ముగించుకొని నవంబర్ లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.