Begin typing your search above and press return to search.

మ‌రో జాబితా విడుద‌ల చేసిన జ‌న‌సేన

By:  Tupaki Desk   |   23 March 2019 4:43 AM GMT
మ‌రో జాబితా విడుద‌ల చేసిన జ‌న‌సేన
X
టోకుగా కాకుండా అప్పుడు కొన్ని.. అప్పుడు కొన్ని అన్న‌ట్లుగా విడుద‌ల చేస్తున్న అభ్య‌ర్థుల జాబితాను విడుద‌ల చేస్తున్న జ‌న‌సేన తాజాగా మ‌రో జాబితాను విడుద‌ల చేసింది. ఏపీ ప‌రిధిలోని 16 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించిన అభ్య‌ర్థుల జాబితాను ఆ పార్టీ ఖ‌రారు చేసింది. ఇప్ప‌టికే ప‌లుమార్లు జాబితాను విడుద‌ల చేసిన జ‌న‌సేన‌.. తాజాగా జాబితా విడుద‌ల సంద‌ర్భంగా త‌న తీరుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించింది.

ప్ర‌తిసారీ అర్థ‌రాత్రి దాటిన త‌ర్వాత జాబితాను విడుద‌ల చేసే జ‌న‌సేన అందుకు భిన్నంగా ఈసారి మాత్రం రాత్రి ప‌ది గంట‌ల వేళ‌లో విడుద‌ల చేసింది. తాజా జాబితాలో పేర్కొన్న అభ్య‌ర్థులు ఎవ‌రంటే..

తాజా జాబితాలో ప్ర‌క‌టించిన అభ్యర్థులు వీరే..

1. గుడివాడ - వీఎన్‌వి.రఘునందనరావు
2. జగ్గయ్యపేట - ధరణికోట వెంకటరమణ
3. పొన్నూరు - బోని పార్వతి నాయుడు
4. గురజాల - చింతలపూడి శ్రీనివాస్‌
5. నంద్యాల - సజ్జల శ్రీధర్‌ రెడ్డి
6. మంత్రాలయం - బోయ లక్ష్మణ్‌
7. రాయదుర్గం - కె.మంజునాథ్‌ గౌడ్‌
8. తాడిపత్రి - కదిరి శ్రీకాంత్‌రెడ్డి
9. కల్యాణదుర్గం - కరణం రాహుల్‌
10. రాప్తాడు - సాకె పవన్‌కుమార్‌
11. హిందూపురం - ఆకుల ఉమేష్‌
12. పులివెందుల - తుపాకుల చంద్రశేఖర్‌
13. ఉదయగిరి - మారెళ్ల గురుప్రసాద్‌
14. సూళ్లూరుపేట - ఉయ్యాల ప్రవీణ్‌
15. పీలేరు - బి.దినేష్‌
16. చంద్రగిరి - శెట్టి సురేంద్ర