కేసీఆర్ మనిషి రూపంలోని రాక్షసుడు

Fri May 19 2017 10:01:43 GMT+0530 (IST)

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫై కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నల్లగొండ జిల్లాలో మంత్రి హరీశ్ రావు పర్యటన సందర్భంగా టీఆర్ ఎస్-కాంగ్రెస్ నేతలు పరస్పరం దాడి చేసుకోవడం ఈ దాడిలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి గాయపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో  ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ మనిషిరూపంలో ఉన్న రాక్షసుడని తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యేలను కొని... లొంగని ఎమ్మెల్యేలను చంపడానికి సిద్దపడ్డాడని విమర్శించారు. ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండటం వల్లే పార్టీ నేతలు చెలరేగిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.సీఎల్పీ నేత జానారెడ్డి మీడియాతో మాట్లాడుతూ కోమటిరెడ్డిపై దాడి చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకోకుండా కొట్టకేం చేస్తారని అనడం సిగ్గుచేటని అన్నారు. శంకుస్థాపనకు కోమటిరెడ్డి అడ్డుపడితే శాంతిభద్రతల సమస్య అయ్యేదన్నారు. ఇది ప్రభుత్వ కార్యక్రమం...ఎవడబ్బ సొత్తు కాదని జానారెడ్డి అన్నారు. కోమటిరెడ్డిని 5గంటల పాటు నిర్బంధించడం రాక్షస చర్య అన్నారు. నల్గొండ ఘటనలో బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విపక్షాలను అణగదొక్కి తన బలం పెంచు కుని ప్రజల్లో గౌరవం పెంచుకోవాలని టీఆర్ ఎస్ ప్రభుత్వం భ్రమపడుతోందని జానారెడ్డి అన్నారు. టీఆర్ ఎస్ ప్రభుత్వం అక్రమం గా పెట్టిన కేసులను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తిరగదొడి బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెం కట్‌రెడ్డి దాడిపై జ్యూడీషియల్ విచారణ జరిపించాలని జానారెడ్డి డిమాండ్ చేశారు.

 కాగా రాష్ట్రం నా జాగీరు అన్నట్లుగా వ్యవహరించడం కుదరదని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇష్టం వచ్చినట్లు చేస్తే చూస్తూ ఊరుకోబోమని తేల్చిచెప్పారు. ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా 66శాతం మంది ఓట్లు వేశారని విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలని ఉత్తమ్ తెలిపారు. పోలీసులతో అణచివేయాలనుకుంటే ఎలా సమాధానం చెప్పాలో మాకు తెలుసని ఉత్తమ్ అన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/