Begin typing your search above and press return to search.

కొత్త రూల్: పెళ్లికి 500 మందినే పిలవాలట

By:  Tupaki Desk   |   22 Feb 2017 5:03 AM GMT
కొత్త రూల్: పెళ్లికి 500 మందినే పిలవాలట
X
జీవితంలో జరిగే పెళ్లిని వీలైనంత ఘనంగా చేసుకోవాలని చాలామంది భావిస్తుంటారు. అయితే.. పెళ్లి పేరుతో వనరుల్ని వృధా చేస్తున్నారని.. బాగున్న వారికి బాగానే ఉన్నా.. మధ్యతరగతి.. దిగువ మధ్య తరగతి లాంటి వారికి మాత్రం పెళ్లిళ్ల వేడుక అదో భారంగా మారిందన్న విమర్శ ఉంది. ఇలాంటి వాటికి చెక్ చెప్పేందుకు వీలుగా కేంద్రం త్వరలో పెళ్లిళ్ల మీద ఒక చట్టాన్ని చేయాలని భావిస్తోంది.

ఇదిలా ఉంటే.. జమ్ముకశ్శీర్ రాష్ట్రం ఏకంగా ఒక చట్టాన్నే చేసేసింది. అంతేనా.. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈ కొత్త పెళ్లిళ్ల చట్టాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. తాజాగా తయారు చేసిన చట్టం ప్రకారం.. పెళ్లికి అనవసరమైన హంగామా చేసే అవకాశం లేదు. ఎందుకంటే.. జమ్ముకశ్శీర్ రాష్ట్రంలోజరిగే పెళ్లి విషయంలో అనేక ఆంక్షలు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.

రాష్ట్రంలోజరిగే పెళ్లిళ్లకు పిలిచే అతిధుల మీద కూడా పరిమితి విధించాలని కశ్శీర్ సర్కారు నిర్ణయించింది. అబ్బాయి తరఫు వారు గరిష్ఠంగా 400 మంది.. అమ్మాయి తరఫు వారు గరిష్ఠంగా 500 మంది అతిదులును మాత్రమే పెళ్లికి పిలవాలి.ఒకవేళ.. ఎంగేజ్ మెంట్ లాంటి చిన్న కార్యక్రమాలకైతే అతిధుల సంఖ్య 100కు మించకూడదన్నది రూల్ గా పెట్టేశారు.

అంతేకాదు.. లౌడ్ స్పీకర్లు ఉపయోగించటం.. బాణసంచా కాల్చటం లాంటి వాటి మీదా పరిమితులు పెట్టటం విశేషం. అంతేకాదు.. పెళ్లి పత్రికల్ని ఇచ్చే సమయంలో స్వీట్లు.. డ్రైఫ్రూట్స్ లాంటి వాటిని ఇవ్వటంపైనా నిషేధాన్ని విధించటం గమనార్హం. స్వతంత్ర భారతంలో నచ్చినట్లుగా పెళ్లి చేసుకోవటం.. బంధువులు.. స్నేహితుల సమక్షంలో ఘనంగా వివాహాన్ని జరపటం నిన్నటి మాటే అవుతుందేమో. త్వరలో ఇదే తరహాలో లోక్ సభలో మోడీ సర్కారు బిల్లు పెడుతుండటం గమనార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/