Begin typing your search above and press return to search.

‘బీకాంలో ఫిజిక్స్’తో మంత్రి ఛాన్స్ మిస్

By:  Tupaki Desk   |   27 Feb 2017 1:49 PM GMT
‘బీకాంలో ఫిజిక్స్’తో మంత్రి ఛాన్స్ మిస్
X
పెద్దోళ్ల మాటలు సద్దన్నం మూటలని ఊరికే చెప్పలేదు. కాలు జారినా ఫర్లేదు కానీనోరు మాత్రం జారొద్దంటూ చెప్పిన మాటల్ని రాజకీయ నేతలు పూర్తిగామర్చిపోయి చాలాకాలమే అయ్యింది. అసలు రాజకీయం.. అందులోనూ దూకుడుపాలిటిక్స్ జోరుగా సాగుతున్న వేళ.. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం నేతలకుఅలవాటైంది. తామేం మాట్లాడుతున్నామో.. ఆ మాటల ప్రభావం భవిష్యత్తు మీదఎంతలా ఉంటుందన్న విషయాన్ని అస్సలు పట్టించుకోకుండా మాట్లాడే మాటలుమంత్రి అయ్యే అవకాశాన్ని మిస్ అయ్యే ఉదంతం తాజాగా చోటు చేసుకుంది.

గతంలో కొద్ది మందికి మాత్రమే తెలిసిన.. ఏపీ టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్.. ఒక ఇంటర్వ్యూలో తెలుగువారికే కాదు.. చాలామందికి సుపరిచితులుగా మారిపోయారు. అయ్యగారు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన గారి మేధోతనం..సినిమాల్లో జోకులేసుకునే వరకూ వెళ్లిందంటే ఆయన ఇమేజ్ ఎంతలా డ్యామేజ్ అయ్యిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. తాను బీకాంలో ఫిజిక్స్ చదివానంటూ ఒక ఇంటర్వ్యూలో ధీమా చెప్పిన ఎపిసోడ్.. నవ్వటం తెలీని వారు సైతం పడిపడినవ్వేలా చేసిన పరిస్థితి.

అయ్యగారి మేథోతనానికి అందరూ అవాక్కు అయ్యే పరిస్థితి. తాను డిగ్రీ చేసినట్లుగా ఆయన చెప్పిన మాటలకు.. డిగ్రీ చదివినోళ్లు.. చదవాలనుకునే వారు కాస్త ఆలోచనల్లో పడే దుస్థితి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని నుంచి అడ్డదిడ్డంగా జంప్ అయి.. అధికార టీడీపీలో చేరిన జలీల్ ఖాన్.. మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవిమీద కన్నేశారు. జగన్ కు హ్యాండ్ ఇచ్చి పార్టీలో చేరిన దానికి ప్రతిఫలంగా చంద్రబాబు ఆయనకు మంత్రి పదవిని కట్టబెట్టాలనుకున్నారు కూడా.

అయితే.. మధ్యలో బయటకు వచ్చిన పాడు ఇంటర్వ్యూ ఆయన లక్ ను పూర్తిగా మార్చేసింది. బీకాంలో ఫిజిక్స్ ఎమ్మెల్యేగా ఫేమస్ అయిన జలీల్ ఖాన్ కు కానీమంత్రివర్గంలో చోటు ఇస్తే.. పార్టీ పరువు పక్కనే ఉన్న కృష్ణానదిలో కలిసిపోతుందన్న భయంతో చంద్రబాబు.. ఆయన పేరును విస్తరణ లిస్ట్ లో నుంచి డిలీట్ చేసినట్లు చెబుతున్నారు. అదే సమయంలో.. మైనార్టీ కోటాను భర్తీ చేసేందుకు.. ఇటీవల కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన మహ్మద్ జానీకి మంత్రి పదవి ఇవ్వాలని డిసైడ్ చేసినట్లు తెలుస్తోంది. ఒక్క ఇంటర్వ్యూ జలీల్ ఖాన్ తలరాతను పూర్తిగా మార్చేసిందని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/