పవన్ ఆ మాట అంటాడా?బాలయ్య మాట తప్పు కాదు

Sun Apr 22 2018 15:44:29 GMT+0530 (IST)

నోరు తెరిస్తే చాలు.. ఏం జరుగుతుందోనన్న భయాందోళనలు కొందరు నేతల్ని చూసినప్పుడు కలుగుతుంది. వారి నోటి నుంచి ఎప్పుడేం మాట వస్తుందో అర్థం కాని రీతిలో మాట్లాడే నేతలు కొందరు ఉంటారు. తెలుగు మీడియాలో పెద్దగా ఫోకస్ కాలేదు కానీ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకరోజు దీక్ష సందర్భంగా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఇంగ్లిషు మీడియా చేసుకున్న కామెడీ అంతా ఇంతా కాదు.బాలయ్య మాటల్ని పెద్ద పెద్ద ఆర్టికల్స్ రాసుకున్న ఇంగ్లిషు మీడియా.. బాలయ్య హిందీ నైపుణ్యాన్ని అందరికి తెలిసేలా చేసేందుకు పెద్ద ఎత్తున న్యూస్ ఆర్టికల్స్ ను ప్రింట్ చేశారు. ఇదిలా ఉంటే.. ఏపీ టీడీపీ ఎమ్మెల్యే.. బీకాంలో ఫిజిక్స్ అన్న ఒక్క డైలాగ్ కు రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన పాపులార్టీని సంపాదించుకున్న టీడీపీ నేత జలీల్ ఖాన్ తాజాగా తన పార్టీని.. పార్టీ అధినేతను వెనకేసుకునే ప్రయత్నం చేశారు.

టీడీపీ చీఫ్ చంద్రబాబు.. ఆయన కుమారుడు లోకేశ్ లపై ఆరోపణలు గుప్పిస్తున్న పవన్ను తీవ్రస్థాయిలో తప్పు పట్టిన ఆయన. నిన్నటిదాకా బాబును.. లోకేశ్ ను తెగ పొగిడారన్నారు. ఈ రోజున పవన్ కల్యాణ్ యూటర్న్ తీసుకోవటాన్ని తప్పు పట్టారు. కొన్ని టీవీ ఛానళ్లనుచూడొద్దని పవన్ చెప్పటం విడ్డూరంగా ఉందన్నాయన.. ప్రజాస్వామ్యంలో ఇలాంటి విధానాలు మనలేవన్నారు. గతంలో చిరంజీవి చేస్తున్నట్లే పవన్ కూడా కాపులను మోసం చేస్తున్నారన్నారంటూ ఆరోపించారు.

బాబు దీక్ష సందర్భంగా ప్రధాని మోడీని ఉద్దేశించి ప్రముఖ నటులు.. హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య చేసిన వ్యాఖ్యల్ని సమర్థించారు జలీల్ ఖాన్. ఈ అంశంపై బాబుపై బీజేపీ నేతలు విమర్శలు చేయటం సరికాదన్నారు. బాబును తప్పు పట్టేందుకు బీజేపీ నేతలు జప్ఫాల మాదిరి మాట్లాడుతున్నట్లు చెప్పిన జలీల్ ఖాన్.. మోడీ కంటే బాబుది సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉందని  కితాబులు ఇచ్చుకోవటం విశేషం. ఈ పొగడ్తలదేముంది కానీ.. బాబు తనపై చేస్తున్న విమర్శలు.. ఆరోపణల్ని విన్నాక మోడీ ఎలాంటి నిర్ణయం ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారిందని చెప్పక తప్పదు.