Begin typing your search above and press return to search.

కాంగ్రెస్‌ లోకి రేవంత్‌..జైపాల్ రెడ్డి రియాక్ష‌న్...

By:  Tupaki Desk   |   17 Oct 2017 2:36 PM GMT
కాంగ్రెస్‌ లోకి రేవంత్‌..జైపాల్ రెడ్డి రియాక్ష‌న్...
X
తెలంగాణ తెలుగుదేశం పార్టీకి మ‌రో గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్పాటైన త‌ర్వాత తెలంగాణ‌లో పూర్తిగా బ‌ల‌హీన‌మైపోయిన సైకిల్ పార్టీకి ఇప్పుడు టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి రూపంలో గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గ‌ల‌నుంది. కొద్దికాలంగా టీడీపీలో అసంతృప్తిగా ఉన్న రేవంత్ రెడ్డి త‌న దారి తాను చూసుకోవ‌డం దాదాపుగా ఖ‌రారు అయింది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరనున్నార‌ని...ఇందులో భాగంగా మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం 3.30గంటలకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఢిల్లీలో కలిసిన‌ట్లు మీడియాలో జోరుగా ప్ర‌చారం సాగింది.

గ‌త రెండ్రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఈ రోజు రాహుల్ గాంధీని ఆయ‌న నివాసంలో క‌ల‌వ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. దీంతో అక్క‌డ మీడియా హ‌డావుడి చోటుచేసుకుంది. అదే స‌మ‌యంలో తెలుగుమీడియాలోనూ పెద్ద ఎత్తున వార్త‌ల హ‌డావుడి సాగింది. తాను కాంగ్రెస్‌ లో చేర‌డం లేదంటూ రేవంత్ చెప్పుకొస్తున్న‌ప్ప‌టికీ... నవంబర్ 9న రాహుల్ గాంధీ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పార్టీలో చేరనున్నారని దాదాపు అన్ని మీడియాల్లో జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. రేవంత్ తో పాటు పలువురు టీడీపీ నేతలు కాంగ్రెస్ లో చేరే అవకాశముంద‌ని స‌మాచారం.

మ‌రోవైపు రేవంత్‌ రెడ్డికి పిల్ల‌నిచ్చిన మామ సోద‌రుడు - కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌ - కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి ఈ ప‌రిణామంపై స్పందించారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారనే సమాచారం లేదని ఆయన అన్నారు. ఎవరు ఏ పార్టీలోకి రావాలన్నా హై కమాండ్ నిర్ణయిస్తుందని చెప్పారు. హై కమాండ్ నిర్ణయాన్ని శిరసావహిస్తానన్నారు. పార్టీకి లాభం కలిగే ప్రతి అంశాన్ని సమర్థిస్తానన్నారు. తెరాస - బీజేపీలతో సంబంధం లేని ఏ పార్టీ మాతో కలిసి వచ్చినా మంచిదేనని జైపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.