Begin typing your search above and press return to search.

హ‌రీశ్ పై జ‌గ్గారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

By:  Tupaki Desk   |   22 Jun 2019 10:31 AM GMT
హ‌రీశ్ పై జ‌గ్గారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!
X
ఇప్ప‌టివ‌ర‌కూ లేని రీతిలో ఊహించ‌ని రీతిలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ క‌మ్ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి. గ‌డిచిన కొద్ది రోజులుగా మాజీ మంత్రి హ‌రీశ్ పేరుతో కేసీఆర్ పై విమ‌ర్శ‌లు చేస్తున్న కాంగ్రెస్ నేత‌ల‌కు భిన్నంగా ఆయ‌న‌.. హ‌రీశ్ పై తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు.

కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా కాంగ్రెస్ హ‌యాంలో ప్రాజెక్టు క‌ట్ట‌లేదంటూ హ‌రీశ్ చేసిన వ్యాఖ్య‌ల్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు జ‌గ్గారెడ్డి. ఆయ‌న వ్యాఖ్య‌ల్ని తాను తీవ్రంగా ఖండిస్తున్న‌ట్లు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ హ‌యాంలోనే శ్రీ‌శైలం.. నాగార్జున‌సాగ‌ర్‌.. సింగూరు..కల్వ‌కుర్తి.. నెట్టెంపాడు.. బీమా.. దేవాదుల లాంటి ప్రాజెక్టులు పూర్తి అయ్యాయ‌ని.. ఇంకా అనేక ప్రాజెక్టులు క‌ట్టిన‌ట్లు గుర్తు చేశారు.

తాను హ‌రీశ్ మాదిరి గోతులు తీసే ర‌కం కాద‌న్నారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వ హ‌యాంలో ఎన్ని ప్రాజెక్టులు క‌ట్టార‌న్న చ‌ర్చ‌కు హ‌రీశ్ రాగ‌ల‌రా? అంటూ స‌వాల్ విసిరిన ఆయ‌న‌.. ఐదేళ్లు ఇరిగేష‌న్ మంత్రిగా ఉన్న హ‌రీశ్ ఎన్ని ప్రాజెక్టులు క‌ట్టారో చెప్పాల‌ని స‌వాల్ విసిరారు. కాంగ్రెస్ హ‌యాంలో ప్రాజెక్టులు క‌ట్ట‌లేద‌న్న హ‌రీశ్ మాట‌ల‌కు మిగిలిన కాంగ్రెస్ నేత‌లు పెద్ద‌గా రియాక్ట్ కాకుంటే.. జ‌గ్గారెడ్డి మాత్రం తీవ్రంగా రియాక్ట్ అవుతున్న వైనం ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు.