Begin typing your search above and press return to search.

జ‌గ‌న‌న్న‌కు తోడుగా!... ఫేస్ బుక్ యాడ్స్ లీడ్ ఇదే!

By:  Tupaki Desk   |   23 April 2019 11:03 AM GMT
జ‌గ‌న‌న్న‌కు తోడుగా!... ఫేస్ బుక్ యాడ్స్ లీడ్ ఇదే!
X
సార్వత్రిక ఎన్నిక‌ల కోలాహ‌లం ఇంకా కొన‌సాగుతూనే ఉంది. ఈ రోజుతో మూడు ద‌శ‌ల పోలింగ్ ముగియ‌నుండ‌గా... ఇంకా నాలుగు విడ‌త‌ల ఎన్నిక‌లు మిగిలే ఉన్నాయి. హోరాహోరీగా సాగిన ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌లు, ఆ రాష్ట్రంలోని లోక్ స‌భ ఎన్నిక‌ల‌తోనే ఈ నెల 11న‌నే ముగిశాయి. ఎన్నిక‌ల్లో కీల‌క ఘ‌ట్టం పోలింగ్ ముగిసిన నేప‌థ్యంలో ఇప్పుడైతే కాస్తంత ప్ర‌శాంత వాతార‌ణం నెల‌కొంది గానీ... ఈ నెల 9 దాకా ఒక‌టే గోల. టీవీలు చూసినా, ప‌త్రిక‌లు తిర‌గేసినా... అంత‌టా రాజ‌కీయ పార్టీల అడ్వ‌ర్జైజ్ మెంట్సే క‌నిపించేవి. ఇక సోష‌ల్ మీడియా త‌న‌దైన స‌త్తా చాటుతున్న నేప‌థ్యంలో ఆ వేదిక‌ల మీదా యాడ్స్ గోలే.

ఏ చిన్న వీడియో చూద్దామ‌న్నా... ఆ వీడియో ముగిసేలోగానే ఆయా పార్టీల‌కు చెందిన రెండు, మూడు యాడ్స్ ప్ర‌త్య‌క్ష‌మ‌య్యేవి. యూట్యూబ్ తో పాటు సోష‌ల్ మీడియా లీడింగ్ ఫ్లాట్ ఫాం ఫేస్ బుక్ లో అయితే చెప్పాల్సిన ప‌నే లేదు. ఆ పార్టీ, ఈ పార్టీ అని తేడా లేదు... అన్ని పార్టీలూ త‌మ‌దైన శైలి యాడ్స్ ను ఫేస్ బుక్ లో కుమ్మ‌రించేశాయి. ఇందుకోసం ల‌క్ష‌లు కాదు కోట్ల మొత్తాల‌ను కూడా మంచి నీళ్ల‌లా ఖ‌ర్చు చేశాయి. స‌రే... ఏపీకి సంబంధించిన ఎన్నిక‌ల గోల అయిపోయింది క‌దా... ఈ క్ర‌మంలో ఏఏ పార్టీ ఎంత‌మేర ఖ‌ర్చును యాడ్స్ కు వినియోగించాయి అన్న విష‌యాల్లోకి వెళితే... ఇంత మొత్తం మేర ఆయా పార్టీలు ఖ‌ర్చు చేశాయ‌ని చెప్పే ప‌క్కా గ‌ణాంకాలేమీ రాలేదు గానీ... యాడ్స్ లో అత్య‌ధికంగా ఎవ‌రు ఖ‌ర్చు చేశారు? త‌మ యాడ్స్ లో ఆయా పార్టీలు ఏ ఏ యాడ్స్‌కు ఎక్కువ మొత్తం ఖ‌ర్చు పెట్టారు? అన్న విష‌యాల్లో కాస్తంత క్లారిటీ వ‌చ్చింది. ప‌క్కా గ‌ణాంకాలు కూడా త్వ‌ర‌లోనే విడుద‌ల కానున్నాయి.

ఇప్ప‌టిదాకా విడుద‌లైన వివ‌రాల ప్ర‌కారం ఫేస్ బుక్ లో వైసీపీ ఇచ్చిన యాడ్స్ మిగిలిన వారి కంటే ఎక్కువ క‌నిపించాయి. అందులోనూ ఆ పార్టీ ప్ర‌త్యేకంగా రూపొందించిన *జ‌గ‌న‌న్న‌కు తోడుగా* అనే యాడ్ కోసం వైసీపీ భారీ ఎత్తున ఖ‌ర్చు చేసింది. ఈ యాడ్ కు వెచ్చించిన మొత్తం ప్రాంతీయ పార్టీల యాడ్స్ లో టాప్ పొజిష‌న్ ను ద‌క్కించుకుంది. ఇక టీడీపీ సంధించిన యాడ్స్ లో *ఏపీ విత్ సీబీఎన్‌*లీడ్ క‌నిపించింది. ప్రాంతీయ పార్టీల జాబితాలో ఓడిశా సీఎం, బిజూ జ‌న‌తాద‌ళ్ టాప్ లో ఉంది. ఆ పార్టీ అధినేత న‌వీన్ ప‌ట్నాయ‌క్‌... సింప్లిసిటీకే ప్రాదాన్య‌మిచ్చే నేత అయిన‌ప్ప‌టికీ... ఈ ఎన్నిక‌ల్లో ఫేస్ బుక్ యాడ్స్ పై భారీగానే ఖ‌ర్చు చేశారు. ఇక కేర‌ళ‌లోని ఎడీఎఫ్ కూడా ఈ కోవ‌లో బాగానే ఖ‌ర్చు చేసింది. ఇక జాతీయ పార్టీల విష‌యానికి వ‌స్తే... ఫేస్ బుక్ యాడ్స్ కోసం అత్య‌ధికంగా ఖ‌ర్చు చేసిన పార్టీల్లో బీజేపీ టాప్ లో నిల‌వ‌గా... విప‌క్ష కాంగ్రెస్ కూడా భారీగానే ఖర్చు చేసింద‌ట‌.