Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ క్లారిటీ లేఖ‌కు జైట్లీ జ‌వాబేంటో?

By:  Tupaki Desk   |   24 Jun 2017 4:22 AM GMT
జ‌గ‌న్ క్లారిటీ లేఖ‌కు జైట్లీ జ‌వాబేంటో?
X
వ‌స్తు - సేవ‌ల ప‌న్ను (జీఎస్టీ) అమ‌లుకు కేంద్రంలోని న‌రేంద్ర మోదీ స‌ర్కారు స‌ర్వం సిద్ధం చేస్తుండ‌గా, ముందూ వెనుకా చూసుకోకుండా తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వాల‌తో పాటు దేశంలోని దాదాపుగా అన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాలు కూడా స‌మ్మ‌తి తెలుసుతూ తీర్మానాలు చేసేశాయి. ప‌న్ను ఎగ‌వేత‌దారులను క‌ట్ట‌డి చేయ‌డం, వినియోగ‌దారుడికి అక్క‌డో ప‌న్ను - ఇక్క‌డో ప‌న్ను అన్న వ‌రుస బాదుడు లేకుండా చేయ‌డం వ‌ర‌కైతే జీఎస్టీ బాగానే ఉన్నా... కొన్ని కీల‌క అంశాల విష‌యానికి వ‌స్తే మాత్రం ఆ ప‌న్ను విధానం చాలా ఇబ్బందిక‌రంగానే మార‌నుంద‌న్న వాద‌న వినిపిస్తోంది.

దేశంలో వ్య‌వ‌సాయ రంగం త‌ర్వాత అత్య‌ధిక మంది ఆధార‌ప‌డ్డ చేనేత రంగమైతే... ఈ ప‌న్ను విదానంతో కుదేలైపోవ‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది. త‌క్కువ మార్జిన్ల‌తో బొటాబొటీ లాభాల‌తోనే చేనేత కార్మికులు జీవ‌నం సాగిస్తున్నారు. అయితే నేత త‌యారీలో వారు వినియోగించే రంగులు, దారం వంటి ముడి స‌రుకుల‌పై జీఎస్టీ పేరిట అధిక ప‌న్ను వేసేందుకు కేంద్రం రంగం సిద్ధం చేసింది. కేంద్రం రూపొందించిన డ్రాఫ్ట్ ప్ర‌కార‌మే జీఎస్టీ ప‌న్ను విధానం అమ‌లైతే... చేనేత రంగం దాదాపుగా అంత‌రించిపోవ‌డం ఖాయ‌మే. కేంద్రం చెప్పిన దానికంతా డూడూ బ‌స‌వ‌న్న‌ల్లా త‌లాడిస్తూ వ‌స్తున్న రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు ఈ విష‌యం అర్థ‌మైనా నోరెత్తేందుకు మాత్రం సాహ‌సించ‌డం లేదు.

అయితే ఈ విష‌యంపై ఏపీ విప‌క్ష నేత‌, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గ‌ళం విప్పారు. నిన్న నేరుగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి ఆయ‌న ఓ లేఖ రాశారు. చేనేత రంగానికి సంబంధించి వాస్త‌వ విష‌యాలు, ఆ రంగంపై ప్ర‌త్య‌క్షంగా ఆధార‌ప‌డుతున్న వారు, ప‌రోక్షంగా జీవ‌నం సాగిస్తున్న వారు ఎంత‌మంది ఉన్నారన్న విష‌యాల‌ను ప్ర‌స్తావిస్తూనే... జీఎస్టీ డ్రాఫ్ట్ బిల్లు ప్ర‌కారం ప‌న్నులు అమ‌లైతే చేనేత రంగం చ‌చ్చిపోవ‌డం ఖాయ‌మంటూ ఆ లేఖలో జ‌గ‌న్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

దేశంలో వ్య‌వ‌సాయ రంగం త‌ర్వాత అత్య‌ధిక మంది జ‌నానికి ఆస‌రాగా ఉంటున్న చేనేత రంగాన్ని కాపాడాల్సిన ఆవ‌శ్య‌క‌త ఎంతైనా ఉంద‌ని పేర్కొన్న జ‌గ‌న్‌... చేనేత రంగానికి క‌ష్టంగా మారే వ‌స్తువులను త‌క్కువ ప‌న్ను విభాగంలో చేర్చాల‌ని కోరారు. అంతేకాకుండా చేనేత రంగాన్ని బ‌తికించేందుకు నేత‌న్న‌ల‌ను త‌యారు చేస్తున్న వ‌స్త్రాల‌ను జీఎస్టీ ప‌న్ను నుంచి మిన‌హాయింపు ఇవ్వాల‌ని కూడా ఆయ‌న డిమాండ్ చేశారు. చేనేత రంగానికి సంబంధించి వాస్త‌వ విష‌యాల‌తో, అత్యంత స్ప‌ష్టమైన వివ‌రాల‌తో మోర్ క్లారిటీగా జ‌గ‌న్ రాసిన లేఖ‌కు జైట్లీ నుంచి ఏం స‌మాధానం వ‌స్తుంద‌న్న విష‌యం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/