Begin typing your search above and press return to search.

చంద్రబాబుకు ప్రియమైన శత్రువుల బర్త్ డే విసెష్!

By:  Tupaki Desk   |   20 April 2019 6:54 AM GMT
చంద్రబాబుకు ప్రియమైన శత్రువుల బర్త్ డే విసెష్!
X
రాజకీయ విమర్శలు చేసుకోవడంలో తెలుగునాట పొలిటీషియన్లు ఎప్పుడో గీత దాటేశారు. వ్యక్తిగత విమర్శలు చేసుకోవడానికి వీరు ఏ మాత్రం వెనుకాడే టైపు కాదు. రాజకీయ నేతలు ఒకర్నొకరు విమర్శలు చేసుకోవడంలో ఎంత వరకూ వెళ్లగలరో ఇటీవలే ఎన్నికల ప్రచారంలో భాగంగా అంతా గమనించారు.

అలాంటి విమర్శల సంగతలా ఉంటే.. ఇప్పుడు ఈ నేతలు ఒకరికి మరొకరు శుభాకాంక్షలు చెప్పుకోవడం ఆసక్తిదాయకంగా ఉంది. ఈ రోజు తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి పుట్టిన రోజు. ఈ సందర్భంగా అనేక మంది ఆయనకు విసెష్ చెప్పారు. వారిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కూడా ఉండటం విశేషం.

ట్విటర్ ద్వారా చంద్రబాబు నాయుడుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు జగన్ మోహన్ రెడ్డి. 'Warm birthday greetings to @ncbn garu' అంటూ ట్వీట్ చేశారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. రాజకీయ వైరం ఏమున్నా.. పుట్టిన రోజుకు శుభాకాంక్షలు తెలియజేసుకోవడం మాత్రం చంద్రబాబు, జగన్ ల మధ్యన కొనసాగుతూ ఉంది.

ఇక చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా మోడీ కూడా ట్విటర్ ద్వారా స్పందించడం విశేషం. బాబుకు శుభాకాంక్షలు తెలుపుతూ మోడీ తరఫు నుంచి ట్వీట్ పోస్టు అయ్యింది. ఈ మధ్యంకాలంలో మోడీ మీద కూడా చంద్రబాబు నాయుడు నిప్పులు చెరుగుతున్న సంగతి తెలిసిందే.