Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ భ‌లే ఇరుక్కుపోయాడు

By:  Tupaki Desk   |   8 Oct 2015 7:46 AM GMT
జ‌గ‌న్ భ‌లే ఇరుక్కుపోయాడు
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌యోజ‌నాల కోసం పాటుప‌డుతున్నాన‌ని చెప్తున్న వైసీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్‌ కు ఇపుడు అదే అంశం పెద్ద స‌మ‌స్య‌గా మార‌నుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కు సంజీవ‌ని అయిన ప్ర‌తేక హోదాను వెంట‌నే ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేస్తూ జ‌గ‌న్ దీక్ష చేస్తున్న స‌మ‌యంలోనే ఈ ఆస‌క్తిక‌ర‌మైన పాయింట్ తెర‌మీద‌కు రావ‌డం జ‌గ‌న్‌ కు ఒకింత ఇబ్బందిక‌ర‌మే అని వ్యాఖ్యానిస్తున్నారు.

ఈనెల 22న న‌వ్యాంధ్ర‌ప్రదేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తికి శంఖుస్థాప‌న జ‌ర‌గ‌నుంది. దేశ విదేశాల నుంచి ప్ర‌తినిధులు, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ, దేశంలోని ఆయా రాష్ర్టాల ముఖ్య‌మంత్రులు, ఇత‌ర వీవీఐపీలు ఈ కార్య‌క్ర‌మానికి రానున్నారు. ఇప్ప‌టికే అంద‌రికీ ఆహ్వానాలు అందాయి. ఈ క్ర‌మంలో రాష్ర్ట ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా జ‌గ‌న్‌ కు ఆహ్వానం పంపించారు. అయితే శంఖుస్థాప‌న‌కు జ‌గ‌న్ వ‌స్తాడా? రాడా? అనేది ఇపుడు ఆస‌క్తిక‌రంగా మారింది. జ‌గ‌న్ మొద‌టినుంచి అమ‌రావ‌తి కోసం ఇంత పెద్ద ఎత్తున భూముల సేక‌ర‌ణ‌ను, భారీ స్థాయిలో రాజ‌ధాని నిర్మాణాన్ని వ్య‌తిరేకిస్తూ వ‌స్తున్నారు. ఒక ద‌శ‌లో తాను అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఈ భూముల‌ను వెన‌క్కు తీసుకుంటామ‌ని ప్ర‌క‌టించాడు కూడా. ఆ రేంజ్‌లో స్టేట్‌ మెంట్లు ఇచ్చి...ఇపుడు అట్ట‌హాసంగా జ‌రిగే కార్య‌క్ర‌మానికి జ‌గ‌న్ ఎలా హాజ‌రవుతారు అనే సందేహం క‌లుగుతోంది.

అయితే రాష్ర్ట ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా ఉండి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ భ‌విష్య‌త్ కు కీల‌క‌మైన మ‌లుపుగా ఉండే ఈ కార్య‌క్ర‌మానికి రాక‌పోతే న‌ష్ట‌పోయేది జ‌గ‌నేన‌ని భావిస్తున్నారు. ప్ర‌జ‌లంద‌రికీ ప్రాతినిధ్యం వ‌హించే రాజ‌ధానికి సంబంధించిన కార్య‌క్ర‌మానికి ప్ర‌తిప‌క్ష‌నేత దూరంగా ఉండ‌టం అంటే ఖ‌చ్చితంగా రాంగ్ సిగ్న‌ల్స్ పంప‌డ‌మే అవుతుంద‌ని వివ‌రిస్తున్నారు. మ‌రోవైపు భ‌విష్య‌త్తులో రాజ‌ధాని నిర్మాణం చేప‌ట్టిన త‌ర్వాత అసెంబ్లీ, స‌చివాల‌యం వంటివ‌న్నీ ఇక్క‌డే ఉండే అవ‌కాశం ఉంది. ఎమ్మెల్యేగా ఉన్న జ‌గ‌న్ త‌నకు ద‌క్కిన అవ‌కాశంలో భాగంగా అయిన అమ‌రావ‌తిలో అడుగుపెట్టాల్సిందే. ఈ నేప‌థ్యంలో....దేశ విదేశ ప్ర‌తినిధులు హాజ‌ర‌య్యే స‌మ‌యంలో జ‌గ‌న్‌ దూరంగా ఉండ‌టం స‌రైన‌దా? ఇపుడు దూరంగా ఉండి అపుడు ఎలా వ‌స్తారు? ఒక‌వేళ శంఖుస్థాప‌న కార్య‌క్ర‌మానికి హాజ‌రుకాకపోతే జ‌గ‌న్ రాజ‌ధాని వ్య‌తిరేకి అనే అభిప్రాయంలో బ‌లంగా ప్ర‌జ‌ల్లో నాటుకుపోదా? అనే సందేహాలు ఇపుడు వైసీపీలో శ్రేణులు వినిపిస్తున్నాయి. ఇంత‌కీ జ‌గ‌న్ ఏం చేస్తాడో వేచి చూడాలి మ‌రి.