Begin typing your search above and press return to search.

జగన్ అభయం.. వారినేం చేసిందంటే..

By:  Tupaki Desk   |   24 March 2017 4:44 PM GMT
జగన్ అభయం.. వారినేం చేసిందంటే..
X
కొండ మీద కోతిని తెచ్చి ఇవ్వమని అడగటం లేదు. న్యాయమైన తమ సమస్యల్నిపరిష్కరించమని మాత్రమే అడుగుతున్నారు. అయినప్పటికీ.. ఏపీ ముఖ్యమంత్రికి వేలాది మంది గోడు అస్సలు వినిపించటం లేదు. తమ సమస్యల పరిష్కారం కోసం ఏళ్ల తరబడి ఆందోళనలు చేస్తున్నా.. సావధానంగా కూడా వినని తీరుపై వీఆర్ఏలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో వీఆర్ఏలకు రూ.10,700వేల చొప్పున జీతం ఇస్తుంటే.. ఏపీలో మాత్రం చాలీచాలని జీతాలు ఇస్తున్న దుర్మార్గంపై గడిచిన మూడున్నరేళ్లుగా పోరాడుతున్న ప్రయోజనం చెందని దుస్థితి.

తీపి మాటలు చాలానే చెప్పే చంద్రబాబు తీరు కళ్లకు కట్టేలా చేస్తూ.. వీఆర్ఏ ఉద్యోగులు తమ వెతల్ని చెప్పుకుంటున్నారు. వారి వేదనల్ని విన్న విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా స్పందించారు. రానున్న ఏడాది ఎన్నికల ఏడాదని.. ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో తమ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని.. తమ ప్రభుత్వం ఏర్పడిన వారం రోజులకే వీఆర్ఏల సమస్యను పరిష్కరిస్తానని.. పక్కరాష్ట్రం కంటే మిన్నంగా జీతాలు ఇస్తానన్న హామీని ఇచ్చారు.

అంతలోపు.. ఏపీ సర్కారు డిమాండ్లను తీర్చేందుకు పోరాడదామన్నారు. ‘‘చంద్రబాబుతే పని చేయించుకోలేకపోతే.. ఎన్నికల తర్వాత వచ్చేది మనందరిది. కచ్ఛితంగా వీఆర్ ఏలకు రూ.15వేల జీతం ఇస్తా. ప్రభుత్వం ఏర్పడిన వారం రోజుల్లోనే హామీని నెరవేరుస్తా. పక్కనున్న తెలంగాణరాష్ట్రంలో వీఆర్ ఏలకు రూ.10,700 ఇస్తుంటే..చంద్రబాబు అంతకంటే తక్కువ జీతాల్ని ఇస్తున్నాడు. ఆయన చర్మం మందం ఎక్కింది. మన వినతుల్ని వింటే సరి. లేకుంటే..మన ప్రభుత్వం వచ్చిన వెంటనే.. మీ సమస్యల్ని పరిష్కరిస్తా. హామీల్ని నెరవేరుస్తా’’ అని హామీ ఇచ్చారు. జగన్ మాటలతో వీఆర్ఏలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/