ఐ మిస్ యు డాడీ - జగన్

Sun Jun 16 2019 23:25:54 GMT+0530 (IST)

జూన్ 16... ఫాదర్స్ డే. ఏటా విశ్వవ్యాప్తంగా తండ్రులను గుర్తు చేసునేందుకు ఏర్పాటైన ఈ రోజున... అందరూ తమను చేయి పట్టుకుని నడిపించిన తమ తండ్రులను గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా ఈ ఏడాది కూడా ఆదివారం ఫాదర్స్ డే సందర్భంగా పలువురు ప్రముఖులు తమ తండ్రులను గుర్తు చేసుకున్నారు. తండ్రులతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇందులో భాగంగానే ఇటీవలే నవ్యాంధ్రకు నూతన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన తండ్రి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డిని గుర్తు చేసుకున్నారు. ఫేస్ బుక్ వేదికగా అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు చెప్పిన జగన్... తన తండ్రిని గుర్తు చేసుకుని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.‘నిన్ను మిస్సవుతున్నాం నాన్నా’ మొదలైన జగన్ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారిపోయింది. తండ్రితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్న జగన్... తన ఉన్నతికి - ప్రస్తుతం తనకు దక్కిన సీఎం పదవి కూడా తన తండ్రి కారణంగానే వచ్చిందని చెబుతూ... తన తండ్రి నేర్పిన పాఠాలతోనే తానీ స్థాయికి చేరానని జగన్ చెప్పుకొచ్చారు. జగన్ పోస్ట్ ఎలా సాగిందంటే... ‘నిన్ను మిస్సవుతున్నాం నాన్నా. ఇవాళ నువ్వు మా మధ్య ఉండాల్సిన వాడివి. నేడు నేనీ స్థాయిలో ఉన్నానంటే నీ దీవెనలు - నువ్వు నేర్పిన పాఠాలు మాత్రమే కారణం నాన్నా’ అని సదరు పోస్ట్ లో తన తండ్రిని గుర్తు చేసుకుని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
   

TAGS: Jagan YSR