Begin typing your search above and press return to search.

వైర‌ల్ పిక్ -బాబు గుండెను బ‌ద్ద‌లు చేసిన ఫొటో

By:  Tupaki Desk   |   16 April 2018 12:03 PM GMT
వైర‌ల్ పిక్ -బాబు గుండెను బ‌ద్ద‌లు చేసిన ఫొటో
X
గ‌త ఎన్నిక‌ల‌ను విశ్లేషిస్తే.... వైఎస్ హ‌యాంలో బ‌లంగా ఉన్న రాయ‌ల‌సీమ‌లో వైసీపీ అధినేత జ‌గ‌న్ కూడా స‌త్తా చాటాడు. ద‌క్షిణ కోస్తాలో ప్ర‌భంజ‌నం చూపాడు. బొటాబొటి ఓట్ల శాతంతో (కేవ‌లం రెండు శాత‌మే టీడీపీకి-వైసీపీకి తేడా) గెలిచినా దానిని క‌న్వీనియెంట్ గా ప‌క్క‌న పెట్టిన టీడీపీ శ్రేణులు సొంత ప్రాంతంలో, కులం మ‌ద్ద‌తు ఉన్న చోట తప్ప జ‌గ‌న్ ప్ర‌భావం ఎక్క‌డా లేద‌ని కోత‌లు కోశారు. జ‌గ‌న్ ప్ర‌భావం ఎక్క‌డా లేక‌పోతే ఎందుకు రెండు శాత‌మే తేడా వ‌చ్చిందంటే... ఇంత‌వ‌ర‌కు టీడీపీ వ‌ద్ద స‌మాధాన‌మే లేదు. పైగా మూడు పార్టీలు ఒకవైపు-జ‌గ‌న్ ఒక‌వైపు.

ఇక ప్ర‌స్తుతంలోకి వ‌స్తే రైటో రాంగో జ‌గ‌న్ ఒకటే మాట మీద నిల‌బడి చ‌ట్టం లాగే త‌ను కూడా త‌న ప‌ని తాను చేసుకుంటూ పోయారు. అది నేడు జ‌నంలో న‌మ్మకం పెంచింది. అందుకే చంద్ర‌బాబు అనుభ‌వం, ప‌ని, టెక్నాలజీ, అభివృద్ధి అన్నీ తోసిరాజ‌ని జ‌గ‌న్ వెంట జ‌నం న‌డుస్తున్నారు. రాయ‌ల‌సీమలో అడుగ‌డుగునా కిక్కిరిసి ముందుకు సాగిన పాద‌యాత్ర ద‌క్షిణ కోస్తాలోనూ అదే ప్ర‌భంజ‌నం కొన‌సాగించింది. అయితే, గుంటూర్లోకి ఎంట‌ర్ కానీ .... ఆయ‌న బండారం బ‌య‌ట ప‌డుతుందని బాబు అనుకూల మీడియా చేసిన రాజ‌కీయ ప‌క్ష‌పాత విశ్లేష‌ణ‌లు గుంటూరు స‌భ‌ల‌తో జ‌గ‌న్ ప‌టాపంచ‌లు చేశాడు. పాద‌యాత్ర అయినా-స‌భ పెట్టినా జ‌న‌మే జ‌నం. అయితే, ఇదంతా ఒక ఎత్తు. విజ‌య‌వాడ ఒక ఎత్తు.

రాష్ట్రంలో అత్య‌ధికంగా క‌మ్మ వారు ఉండే విజ‌య‌వాడ‌లో క‌చ్చితంగా జ‌గ‌న్ క‌థ అంతే అనుకున్నారంతా. కానీ బెజ‌వాడ బ్రిడ్జి ఊగింది. కిలోమీట‌ర్ల‌ పొడ‌వునా స‌మైక్యాంధ్ర ఉద్య‌మ స‌మ‌యంలో కూడా క‌నిపించ‌నంత జ‌నసంద్రం బెడ‌వాడ బ్రిడ్జి మీద క‌నిపించింది. దీనిని చూసి టీడీపీ శ్రేణులు బిత్త‌ర పోయారు. రాజ‌కీయ విశ్లేష‌కులు అవాక్క‌య్యారు. బాబు మీడియా షాక్ అయ్యింది. ఆ ఒక్క బ్రిడ్జి ఫొటో ఏదైతే ఉందో... దానిని ప‌బ్లిష్ చేయ‌లేక‌, చేయ‌కుండా ఉండ‌లేక తిప్ప‌లు పడాల్సిన ప‌రిస్థితి. బ‌హుశా జ‌గ‌న్ కూడా ఊహించ‌ని స్పంద‌న అయి ఉంటుంది ఇది.

దీనివ‌ల్ల రెండు విష‌యాల‌పై క్లారిటీ వ‌చ్చిన‌ట్ట‌య్యింది. ఎప్ప‌టిలాగే గ‌తంలో బ‌లంగా ఉన్న ఏరియాల్లో జ‌గ‌న్ ప‌ట్టు అలాగే ఉండ‌టం ఒక‌టైతే. గ‌తంలో తెలుగుదేశం స‌త్తాచాటిన ప్రాంతాల్లో జ‌గ‌న్‌కు విశేషాద‌ర‌ణ రావ‌డం మ‌రో ఎత్తు. మొత్తానికి ఆ ఒక్క ఫొటో అధికార ప‌క్షం మ‌త్తు వ‌దిల్చింది! సోష‌ల్ మీడియాలో కొంద‌రైతే ఆ ఫొటో పెట్టి *జ‌గ‌న్ ఫ్యాన్స్ మీసం తిప్పిన ఫొటో- ఇదే అసలు ప్ర‌భంజ‌నం* అని కామెంట్ చేశారు.

అస‌లే ప్రాంతానికో స‌మ‌స్య‌తో ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త కూడ‌గ‌ట్టుకున్న బాబు త‌నకు ప‌ట్టున్న ఏరియాల్లో ఇంత ఎలా వీక‌య్యాడ‌బ్బా? !