Begin typing your search above and press return to search.

తెదేపాకు షాక్ : అవిశ్వాసం పెడ్తానన్న జగన్!

By:  Tupaki Desk   |   18 Feb 2018 12:29 PM GMT
తెదేపాకు షాక్ : అవిశ్వాసం పెడ్తానన్న జగన్!
X
సూచన చేసింది... రాజకీయంగా తమ పార్టీ వారేనా.. ఇతర ప్రత్యర్థి వర్గాలకు చెందిన వారా.. అలాంటి వారు చేసిన సూచనలను తాము ఎందుకు పరిగణనలోకి తీసుకోవాలి... అనే రకంగా సంకుచితంగా ఆలోచించే పరిస్థితిలో తాను లేనని వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాటుకున్నారు. తనకు రాష్ట్ర ప్రయోజనాలు మాత్రమే ముఖ్యం అని.. అందుకోసం ఎటువైపు నుంచి మంచి సూచన వచ్చినా ఆచరణలో పెడతానని తేల్చేశారు. రాష్ట్రానికి మంచి జరగడానికి - ఏపీకి జరిగే అన్యాయం గురించి దేశమంతా తెలియడానికి.. మార్చి నెలలో మోడీ సర్కారుపై తామే అవిశ్వాస తీర్మానం పెడతాం అని జగన్ విస్పష్టంగా ప్రకటించారు.

జగన్ నిర్ణయం మోడీకి షాక్ అని చెప్పాలి. జగన్ కదలికలు ఎలా ఉన్నా.. రాష్ట్రానికి మేలు గురించి కేంద్రంపై ఎంత తీవ్రంగా పోరాడుతున్నా - జంతర్ మంతర్ వద్ద ధర్నాలతో సహా - ఏప్రిల్ 6నాడు ఎంపీలందరితో రాజీనామాలు చేయించడం గురించి కూడా తేల్చి ప్రకటించినప్పటికీ.. తెదేపా ఏదో ఒక రకంగా బురద చల్లడమే పనిగా పెట్టుకుంది. తాము ఎన్డీయే నుంచి వైదొలగితే.. మోడీకి దగ్గర కావడానికి జగన్ ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపిస్తూ వచ్చింది.

అలాంటి ఆరోపణలకు కూడా ఒకేసారి చెక్ పెట్టేసేలాగా - అలాంటి దుష్ప్రచారానికి విలువ దక్కకుండా మొత్తానికి జగన్ అవిశ్వాసానికే మొగ్గు చూపారు. విషయం ఎంత సీరియస్ అయినప్పటికీ.. తాము తగ్గేది లేదని, భాజపాతో తాము కుమ్మక్కు అయ్యామన్న ఆరోపణల్లో నిజం లేదని ప్రజలు అర్థం చేసుకునేలాగా.. ఆయన అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించబోతున్నారు. తాము అవిశ్వాసం పెడితే.. తెలుగుదేశం మద్దతిస్తుందా? అని జగన్ అభ్యర్థించడం గమనార్హం. అదే సమయంలో తెదేపా వారు అవిశ్వాసం పెట్టినా.. తమ పార్టీ మద్దతు ఇస్తుందంటూ ఆయన ముందుగనే ప్రత్యర్థి మైలేజీ సంపాదించుకోవడానికి కూడా వెసులుబాటు ఇచ్చారు. ఏ రకంగా చూసినా.. జగన్ నిర్ణయం - తాజా అవిశ్వాసం ప్రకటన.. తెలుగుదేశానికి షాక్ అనే చెప్పాలి. ఈ ఒక్క నిర్ణయంతో జగన్ చిత్తశుద్ధి మీద ప్రజల్లో కాన్ఫిడెన్స్ పెరిగిపోతుందని.. పవన్ కూడా అనివార్యంగా జగన్ కు మద్దతు పలికే పరిస్థితి వస్తుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.