అమరావతిలో జెండా నాటడమే జగన్ లక్ష్యం

Mon Jun 19 2017 15:05:45 GMT+0530 (IST)

కృష్ణా - గుంటూరు జిల్లాల పార్టీ నేతలతో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలపై చర్చించారు.  జులై 8 - 9 తేదీల్లో నిర్వహించనున్న వైసీపీ రాష్ట్ర ప్లీనరీల గురించి పార్టీ నేతలతో  జగన్ చర్చించారు.

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో  అన్ని చోట్ల నియోజకవర్గ స్థాయి ప్లీనరీ సమావేశాలు పూర్తయయ్యాయి.  అదే తరహాలో త్వరలో జిల్లాస్థాయిలోనూ వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి. విజయవాడలో జరగనున్న రాష్ట్రస్థాయి ప్లీనరీ కమిటీలపై పార్టీ నేతలతో వైఎస్ జగన్ చర్చించారు.

ప్లీనరీ సమావేశాల్లో ప్రధానంగా ప్రజాసమస్యలపై చర్చించనున్నారు. అదే విధంగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం ఆ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం గురించి చర్చించనున్నారు.  వైసీపీని  బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై ప్లీనరీ సమావేశాల్లో చర్చలు జరగనున్నాయి.

కాగా వైసీపీ జిల్లా ప్లీనరీ సమావేశాన్ని ఈ నెల 28న శ్రీకాకుళంలో నిర్వహించ నున్నారు. శ్రీకాకుళంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించనున్న ప్లీనరీని విజయవంతం  చేయాలని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్ - జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి కోరారు.  వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం జిల్లాలోని 10 నియోజకవర్గాలలో ప్లీనరీ సమావేశాలను విజయవంతంగా  నిర్వహించామని చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/