Begin typing your search above and press return to search.

బాబు వ్యూహం జగన్‌ కు వరం!

By:  Tupaki Desk   |   2 Nov 2018 5:34 AM GMT
బాబు వ్యూహం జగన్‌ కు వరం!
X
అదృష్టం ఎవరి తలుపు ఎప్పుడు తడుతుందో ఎవరికీ తెలియదు. రాజకీయాలలో ఇదీ చాలా సార్లు నిరూపితమైంది. కేంద్రంలో భారతీయ జనతా పార్టీని - తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితిని గద్దె దించేందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వేసిన వ్యూహం ఆంధ్రప్రదేశ్‌ లో వైఎస్‌ ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరం కాబోతోంది. రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన ఎన్నికలలో వైఎస్‌ ఆర్ కాంగ్రెస్ పార్టీ తృటిలో అధికారానికి దూరం అయ్యింది. ఆ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీని - పవన్ కల్యాణ్‌ ను అడ్డం పెట్టుకుని బతుకు జీవుడా అంటూ అధికారాన్ని పొందింది. ఆ ఎన్నికలలో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీకి ఏ ఒక్క స్థానంలోనూ కూడా డిపాజిట్ రాలేదు. పైగా రాష్ట్రాన్ని రెండుగా చీల్చారనే కోపం ఆంధ్రప్రదేశ్‌ ప్రజలలో నానాటికీ పెరుగుతోంది. వచ్చే ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు దక్కే అవకాశం లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

ఇలాంటి పరిస్థితులలో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడం ఆంధ్రప్రదేశ్‌ లో పెద్ద తప్పిదంగానే చెబుతున్నారు. ఏపీలో వైఎస్‌ ఆర్ కాంగ్రెస్‌ కు - ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌ కు ఆదరణ నానాటికి పెరుగుతోంది. ఈ పరిస్థితులలో కాంగ్రెస్‌ తో బాబు చేతులు కలపడం వైఎస్‌ ఆర్ కాంగ్రెస్‌ కు మరింతా మేలు చేకూర్చేలా ఉంది. అంతో ఇంతో ఓటు బ్యాంకు ఉన్న కాంగ్రెస్ దాన్ని కూడా కోల్పోతుందంటున్నారు. ఆ ఓటు బ్యాంకు కూడా జగన్ వైపు మళ్లే అవకాశం ఉందంటున్నారు. ఇక కాంగ్రెస్‌ తో కలవడం ఇష్టం లేని తెలుగుదేశం ఓటు బ్యాంకు కూడా జగన్‌ వైపే మళ్లే అవకాశాలు ఉన్నాయంటున్నారు. కాంగ్రెస్‌ తో తెలుగుదేశం కలవడాన్ని తెలుగుదేశం పార్టీలో 70 శాతం మందికి ఇష్టం లేదుంటున్నారు. ఈ పరిస్థితులలో చంద్రబాబు నాయుడుకు ఆంధ్రప్రదేశ్‌ లో అధికారం దక్కె అవకాశాలు దరిదాపులలో కూడా ఉండవని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

చంద్రబాబు నాయుడు రాజకీయంగా ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించారని చెప్పుకుంటున్న దాని ఫలితం మాత్రం వైఎస్‌ ఆర్ కాంగ్రెస్‌ కే దక్కుతుందని అంచనా వేస్తున్నారు. ఏ ఆత్మ‌గౌవ‌రం గురించి అయితే చంద్ర‌బాబు చెబుతాడో దాన్ని ఇపుడు కోల్పోయాడు. ఇపుడు ఆత్మ‌గౌర‌వ పోరాట నాయ‌కుడిగా జ‌గ‌న్ అవ‌త‌రించాడు. ఏపీ కోసం ఎవ‌రితో క‌ల‌వ‌కుండా ఒంట‌రిగా ఉండి ఢిల్లీ పాల‌కుల‌ను చీల్చిచెండాడుతున్నాడు జ‌గ‌న్‌. ఇక కులాల వారీగా చూసుకున్న కాంగ్రెస్ పట్ల వ్యతిరేకతతో ఉన్న కొన్ని కులాలు తెలుగుదేశం పార్టీకి ఓటు వేసేవి. ఇప్పుడు ఆ కులాల ఓట్లుు కూడా తెలుగుదేశానికి దక్కే అవకాశాలు లేవంటున్నారు. మొత్తం మీద చంద్రబాబు వ్యూహం బెడిసి కొట్టి వైఎస్ జగన్‌ కు లబ్ది చేకూరడం ఖాయంగా కనిపిస్తోంది.