Begin typing your search above and press return to search.

వీడియోలు చూపించి మ‌రీ బాబుపై జ‌గ‌న్ ఫైర్‌

By:  Tupaki Desk   |   25 Oct 2016 10:47 AM GMT
వీడియోలు చూపించి మ‌రీ బాబుపై జ‌గ‌న్ ఫైర్‌
X
మంట పుట్టించే మాట‌ల‌తో ప్ర‌యోజ‌నం త‌క్కువ‌ని అనుకున్నారో.. రాజ‌కీయ వైరంకార‌ణంగా దాని వ‌ల్ల వ‌చ్చే ఎఫెక్ట్ పెద్ద‌గా ఉండ‌ద‌ని పీల‌య్యారో కానీ ఏపీ విప‌క్ష నేత‌.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఏపీ అధికార‌ప‌క్షంపై తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జమెత్తారు. విభ‌జ‌న నేప‌థ్యంలో ఏపీకి ఇస్తామ‌న్న ప్ర‌త్యేక హోదా అంశాన్ని కేంద్రం తుంగ‌లో తొక్కేసి హ్యాండ్ ఇస్తుంటే.. ఏపీ ముఖ్య‌మంత్రి కేంద్రంపై పోరాడ‌కుండా.. వారి చెప్పిన‌ట్లుగా త‌లూపుతూ ఉండిపోతున్నారంటూ మండిప‌డ్డారు జ‌గ‌న్‌.

తాను చెబుతున్న మాట‌లు రాజ‌కీయం అని అనుకుంటార‌న్న సందేహంతో.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌త్యేక హోదాపై మోడీ.. చంద్ర‌బాబులు చేసిన వ్యాఖ్య‌ల‌కు సంబంధించిన క్లిప్పింగులు చూపించి మ‌రీ ఫైర్ అయ్యారు విప‌క్ష నేత‌. ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం నిర్వ‌హిస్తున్న యువ భేరీల్లో భాగంగా తాజాగా క‌ర్నూలులో నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన జ‌గ‌న్‌.. ఎన్నిక‌ల వేళ హోదా అంశంపై మోడీ.. చంద్ర‌బాబులు చేసిన వ్యాఖ్య‌ల్ని ప్ర‌త్యేకంగా ప్ర‌ద‌ర్శించారు. అనంత‌రం.. వారు మార్చిన మాట‌ల్ని ప్ర‌స్తావిస్తూ.. తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. స‌భ‌కు పెద్ద ఎత్తున హాజ‌రైన యువ‌త‌ను చూసి మ‌రింత ఉత్సాహంగా మాట్లాడిన జ‌గ‌న్ ఘాటు వ్యాఖ్య‌ల్ని చూస్తే..

= ఒక్క‌సారి స్క్రీన్ మీద చూడండి.. ఆ రోజు ఎన్నిక‌ల‌ప్పుడు హోదా ఎంత అవ‌స‌ర‌మ‌న్నారో చూడండి. నెల్లూరులో హోదాపై మోదీ ఏం మాట్లాడారో చూడండి. వెంక‌య్య ఏమ‌న్నారో చూడండి. (అంటూ వీడియో క్లిప్పింగులు ప్ర‌ద‌ర్శించారు) ఆనాడు అలా మాట్లాడిన వారు ఇప్పుడు హోదాపై ఎలా మాట్లాడుతున్నారో చూడండి. (ఈ సంద‌ర్భంలో హోదా మీద మారిన మాట‌ల‌కు సంబంధించిన వీడియో క్లిప్పింగుల్ని ప్ర‌ద‌ర్శించారు)

= ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కు ప్ర‌త్యేక హోదా సంజీవ‌ని. ఆ రోజు ప్ర‌త్యేక హోదాపై మాట్లాడిన నాయ‌కులు ఈ రోజు మ‌రోమాట మాట్లాడుతున్నారు. ప‌రిశ్ర‌మ‌లు వ‌స్తేనే ఉద్యోగాలు వ‌స్తాయ‌న్న‌ది వాస్త‌వం. ప‌రిశ్ర‌మ‌ల కోసం అప్పుడు హోదా కావాలన్న నాయ‌కులే మాట‌మార్చి ఇప్పుడు హోదాతో ప‌రిశ్ర‌మ‌లు, ఉద్యోగాల‌కు సంబంధం లేద‌ని చెబుతున్నారు.

= ఆ రోజు మాటిచ్చి రాష్ట్రాన్ని విడ‌గొట్టారు. పార్ల‌మెంటు సాక్షిగా ప్ర‌త్యేక హోదాపై హామీ ఇచ్చారు. విశ్వాసం, విశ్వసనీయత లేకుండా రాజకీయ నాయకులు ప్రవర్తిస్తున్నారు. మాట తప్పిన నేతలను ప్రజలు గట్టిగా నిలదీయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వ‌స్తే చాలా ప్రయోజనాలు ఉంటాయి. హోదా ఉన్న రాష్ట్రాలకే పారిశ్రామిక రాయితీలు ఇస్తారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీని అర్థరాత్రి సీఎం స్వాగతించారు. జైట్లీ ప్రకటనపై అర్థరాత్రి చంద్రబాబు వివరణ ఇవ్వ‌టం ఏమ‌ట‌ని ప్ర‌శ్నిస్తున్నా. మోడీకి కృతజ్ఞతలు తెలిపి, వెంకయ్యను సీఎం సన్మానించారు... ప్యాకేజీ అంటే ఏమిటో చంద్రబాబుకు తెలుసా? ప్యాకేజీలో ఏముందో చూడకుండా బ్రహ్మాండమైందని చంద్రబాబు పొగిడారు.

= ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కి ప్ర‌త్యేక హోదాపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఇచ్చిన స్టేట్ మెంట్ చూస్తే ఇంగ్లీష్ వ‌చ్చిన ఏ ముఖ్య‌మంత్రి అయినా దానికి అనుకూలంగా స్పందించరు. కానీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు మాత్రం సానుకూలంగా స్పందించారు. జైట్లీ ఇచ్చిన‌ స్టేట్ మెంట్‌ పై చంద్ర‌బాబు నాయుడు స్పందించిన తీరు చూస్తే.. ఆయ‌న‌కు అస‌లు ఇంగ్లీషు వ‌స్తుందా? అని అనుమానం వ‌చ్చింది.

= అరుణ్‌ జైట్లీ ప్ర‌త్యేక‌హోదా కాదు, దానికి త‌గ్గ ప్యాకేజీ ఇస్తున్నాం అంటూ చేసిన ప్ర‌క‌ట‌న‌పై ఎన్డీఏ గ‌వ‌ర్న‌మెంట్లో త‌న పార్టీ మంత్రుల‌ను ఉప‌సంహ‌రించుకుంటున్నాన‌ని చెప్పాల్సిందిపోయి, ఆ ప్రకటన పట్ల సానుకూలంగా ఉన్నానంటూ చంద్ర‌బాబు నాయుడు వ్యాఖ్యానించ‌టం మ‌న ఖ‌ర్మ‌. కేంద్రం ప్రకటనను స్వాగ‌తిస్తున్నాన‌ని, ప్యాకేజీ బాగుంద‌ని చంద్ర‌బాబు చేసిన‌ ప్ర‌క‌ట‌నతో రాష్ట్రం న‌ష్ట‌పోతుంది. ప్యాకేజీ బ్రహ్మాండ‌మైంద‌ని చంద్ర‌బాబు పొగిడారు. అస‌లు ఆయ‌న‌కు ప్యాకేజీ అంటే ఏమిటో తెలుసా?

= అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. పార్ల‌మెంటు సాక్షిగా ఇచ్చిన ప్ర‌త్యేక‌ హోదా హామీని నెర‌వేర్చుకోలేమా? హోదా వచ్చే వ‌ర‌కు పోరాడుదాం. నేను ఒక్క‌డినే పోరాడితే స‌రిపోదు. అంద‌రం క‌లిసి పోరాడితేనే హోదా సాధ్యం. అన్నీ తెలిసే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నారు. ప్ర‌త్యేక హోదా ఉన్న హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌ లో ఎన్నో ప‌రిశ్ర‌మ‌లు వ‌చ్చాయి. హోదాతో లాభం లేదంటూ చంద్ర‌బాబు నాయుడు చెబుతున్న మాట‌ల‌న్ని ప‌చ్చి అబ‌ద్ధాలు. ‘పోరాటం చేస్తూ ఉంటేనే ఈ రోజు కాక‌పోతే రేప‌యినా హోదా సాధించుకోవ‌చ్చు. రేపు ప్ర‌త్యేక హోదా కోసం పోరాడే వారికే ఎన్నిక‌ల్లో ఓటు వేయాలి.

= ప్ర‌త్యేక హోదాపై ఒత్తిడి పెంచే దిశ‌గా పై స్థాయిలో మ‌రింత ఉద్ధృతంగా పోరాటం చేస్తాం. రానున్న‌ పార్ల‌మెంటు స‌మావేశాల్లో మా ఎంపీలు హోదా అంశాన్ని అడుగుతారు. స్పంద‌న రాక‌పోతే మ‌ళ్లీ వ‌చ్చే స‌మావేశాల నాటికి మా ఎంపీల‌తో రాజీనామా చేయిస్తాం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/