ఆటో నడిపి మనుసులు గెలిచిన జగన్..

Wed May 16 2018 15:11:04 GMT+0530 (IST)

 నాయకుడంటే ఎక్కడి నుంచో రాడు.. జనంలోంచే వస్తాడు. వారి కష్టాల్లోంచి పుడతాడు.. జనం కష్టాలు తెలుసు కనుకే జగన్ అంటే జనానికి పిచ్చి.. ఓ చెల్లికి అన్నలా.. ఓ వృద్ధుడికి కొడుకులా.. తన పరా బేధం లేకుండా అందరినీ జగన్ అక్కున చేర్చుకుంటున్నాడు. పాదయాత్రలో ఎన్నో మధుర సృతులను పొందుతున్నాడు. ప్రజాసంకల్ప యాత్రతో ప్రతిపక్ష నేత జగన్  జనానికి చేరువవుతున్నాడు. వారితో అనుబంధాన్ని పెంచుకుంటున్నాడు.. పశ్చిమగోదావరి జిల్లాలో ఈరోజు జరిగిన ఓ సంఘటన ప్రజల మనసుల్లో తీపిగుర్తులా ఉండిపోయింది.ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా ఈరోజు ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. జగన్ పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలోని మేదినరావు పాలెంకు చేరుకుంది.  అక్కడే స్థానిక ఆటోడ్రైవర్లు జగన్ ను కలిశారు.. సొంత ఆటో ఉన్న ప్రతి ఆటోడ్రైవర్ కు ఏడాదికి పదివేలు ఇస్తానని 14న నిర్వహించిన ఏలూరు సభలో జగన్ ప్రకటించడంతో ఆయనను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

జగన్ ను కలిసి ఆటోడ్రైవర్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వారందరినీ మనసారా గుండెలకు హత్తుకున్న జగన్ అభినందనలు తెలిపారు. అంతేకాదు.. ఓ ఆటో డ్రైవర్ ఖాకీ చొక్కను తీసుకొని వేసుకొని ఆటో నడిపి సామాన్యుడిలా కలిసిపోయాడు. జగన్ ఆటో నడపడంతో అక్కడున్న వారంతా ఆనందంతో పొంగిపోయారు. సాధారణ వ్యక్తిలా జనంతో కలిసిపోయిన జగన్ తాను అందరివాడినని నిరూపించాడని ఆటోడ్రైవర్లు హర్షం వ్యక్తం చేశారు.