Begin typing your search above and press return to search.

చంద్రుళ్ల మనసులు మారేందుకు జగన్ దీక్ష

By:  Tupaki Desk   |   30 April 2016 7:51 AM GMT
చంద్రుళ్ల మనసులు మారేందుకు జగన్ దీక్ష
X
ఏపీ అధికారపక్షం చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ నేపథ్యంలో ‘‘సేవ్ డెమోక్రసీ’’ పేరిట ఢిల్లీలో నిరసన కార్యక్రమాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేపట్టటం తెలిసిందే. తాజాగా ఆయన హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లోని పార్టీ ప్రధానకార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన తాను చేయబోయే తాజా నిరసనకు సంబంధించిన వివరాలు వెల్లడించటంతో పాటు.. ఏపీ.. తెలంగాణ ముఖ్యమంత్రుల మనసు మారటం కోసం తాను మే 16 నుంచి 18 వరకు నిరసన ప్రదర్శన చేపట్టనున్నట్లు ప్రకటించారు.

కృష్ణా డెల్టాకు నీళ్లు వచ్చే అవకాశం లేకుండా మహబూబ్ నగర్ నుంచి ఎత్తిపోతల పథకాలతో నీళ్లను తోడేస్తుంటే.. దిగువన ఉన్న ఏపీలోని జిల్లాలతో పాటు.. తెలంగాణలోని ఖమ్మం.. నల్గొండ జిల్లాలకు నీళ్లు రావంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంద్భంగా ఈ అంశంపై ఇద్దరు చంద్రుళ్ల మైండ్ సెట్ మార్చేందుకు తాను మూడు రోజుల నిరసన ప్రదర్శన చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భగా ఏపీ.. తెలంగాణ ముఖ్యమంత్రులపై ఆయన విమర్శలు చారు.

= పాలమూరు నుంచి రంగారెడ్డి లిఫ్ట్ అంటారు. డిండి ప్రాజెక్టు అంటారు. మన కళ్ల ముందే 115 టీఎంసీల నీళ్లను కేసీఆర్ తీసుకుపోతున్నా ఆయన్ను అడగాలని చంద్రబాబుకు ఎందుకు అనిపించదు. కనీసం కేసీఆర్ ను నిలదీసే పరిస్థితి లేదు. ఈ విషయం మీద కేసీఆర్ ను అడగాలన్న ఆలోచన చంద్రబాబుకు ఎందుకు రాదు?

= శ్రీశైలంలోకి నీళ్లు రావాలంటే మహబూబ్ నగర్ నుంచి రావాలని అందరికి తెలుసు. పై నుంచి వచ్చే నీళ్లు మహబూబ్ నగర్ మీదుగా శ్రీశైలం రావాలి. ఆ తర్వాత కిందనున్న నాగార్జున సాగర్ లోకి పోవాలి. కానీ.. మహబూబ్ నగర్ లోనే లిఫ్ట్ పెట్టి నీళ్లు తోడుకుంటామంటే బాబు నోట్లో నుంచి మాట రావట్లేదు. రంగారెడ్డి జిల్లాకు డిండి ప్రాజెక్టుకు నీళ్లు పంపుతామంటే కనీసం ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. డిండి పేరుతో నీళ్లు తోడేస్తే శ్రీశైలం.. నాగార్జునసాగర్ ఏమవుతాయి? కింద ఉన్న జిల్లాల పరిస్థితి ఏంటి? ఈ ప్రాజెక్టుల వల్ల తెలంగాణలోని ఖమ్మం.. నల్లొండ జిల్లాలు కూడా నష్టపోతాయి.

= శ్రీశైలం నుంచి సాగర్ లోకి నీళ్లు వెళ్లకపోతే కృష్ణా డెల్టా పరిస్థితి దారుణంగా మారుతుంది. గోదావరి నీళ్ల పరిస్థితి కూడా అంతే. పట్టిసీమలో నునిల్వ సామర్థ్యం లేదు. జులై.. ఆగస్టు.. సెప్టెంబర్ లలో వచ్చే నీటిని నిల్వ చేసుకుంటేనే తర్వాత నీటిని కిందకు పంపగటం. అప్పుడే రైతులు బాగుపడతారు.

= పోలవరం 190 టీఎంసీల లైవ్ స్టోరేజీతో ఉన్న ప్రాజెక్టు. దాని పనులు 2.. 4 శాతమే పూర్తి అయ్యాయి. ఆ విషయాన్ని కేంద్రమే చెప్పినా ఆ కాంట్రాక్టర్లను చంద్రబాబు మార్చరు. ఓవైపు పెట్రోల్.. డీజిల్.. స్టీల్ రేట్లు అన్ని తగ్గాయి. ఇసుక ఉచితంగా వస్తోంది. అయినా పోలవరం హెడ్ వర్క్ రేట్లు మాత్రం రూ.4 వేల కోట్ల నుంచి రూ.7వేల కోట్లకు పెంచారు. కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోకపోగా.. మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇస్తున్నారు. అందుకే ఈ ప్రాజెక్టుకు నిధులు ఇవ్వటానికి కేంద్రం భయపడుతోంది.

= ఓవైపు కేసీఆర్ గోదావరి.. మరోవైపు కృష్ణా నీటిని తీసుకుపోతుంటే చంద్రబాబు ఎందుకు అడగలేకపోతున్నారు? శ్రీశైలంలో 854 అడుగుల నీరు ఉంటేనే కిందకు పంపగలం. ఇప్పుడు 780 అడుగుల నీళ్లు మాత్రమే ఉన్నాయి.ఈ నీళ్లు నిండేది ఎప్పుడు.. రాయలసీమ ప్రకాశం జిల్లాలకు నీళ్లు ఇచ్చేదెపుడు? అతేకాదు.. నాగార్జునసాగర్ కు ఎలా వెళతాయి? కృష్ణా.. గుంటూరు జిల్లాలకు నీళ్లు ఎలా ఇస్తారు..?

= రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు కేంద్రం దృష్టికి వెళ్లాలనే మూడు రోజుల నిరసన దీక్ష చేస్తున్నా. నేనే స్వయంగా దీక్షకు కూర్చుంటున్నా. చంద్రబాబు.. కేసీఆర్.. కేంద్రం మనసులు మారాలని కోరుకుంటున్నా. డిండి.. పాలమూరు.. రంగారెడ్డి ప్రాజెక్టులకు వ్యతిరేకంగానే నేను నిరసన దీక్ష చేస్తున్నా. కృష్ణా డెల్టా అంటే ఏపీ జిల్లాలు మాత్రమే కాదు.. తెలంగాణలో ఖమ్మం.. నల్గొండ జిల్లాలు కూడా ఉన్నాయి.