Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ ఎంపీల రాజీనామా... వివ‌రాలు ఇవే!

By:  Tupaki Desk   |   22 March 2017 1:04 PM GMT
జ‌గ‌న్ ఎంపీల రాజీనామా... వివ‌రాలు ఇవే!
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా అసెంబ్లీ వాయిదా ప‌డిన అనంత‌రం త‌న కార్యాల‌యంలో వైసీపీ అధినేత‌ - ఏపీ ప్రతిప‌క్ష నేత‌ జగన్ మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సంద‌ర్భంగా ప‌లు అంశాల‌ని స‌వివ‌రంగా పంచుకున్నారు. సభలో తాను మాట్లాడకూడదనే అసెంబ్లీ వాయిదా వేశారని అన్నారు. చంద్రబాబువి భారతంలో ఉత్తరకుమారుడి ప్రగల్భాల‌ని మండిప‌డ్డారు. అనంతపురం పట్టభద్రుల స్థానం సహా 4 చోట్ల తామే గెలిచామ‌ని జ‌గ‌న్ తెలిపారు. చదువుకున్న వారంతా త‌మ‌కే ఓట్లు వేశారని ఇవి ప్రజాస్వామ్యాన్ని ప్రతిబింబించే ఫలితాల‌ని అన్నారు. స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు ప్రలోభాలకు పాల్పడ్డారని, కోట్లు వెచ్చించి కొనుగోలు చేయ‌డంతో పాటుగా ప్రజా ప్రతినిధులను భయబ్రాంతులకు గురిచేశారని జ‌గ‌న్ తెలిపారు.

ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబుకు మరోమారు జ‌గ‌న్ స‌వాల్ విసిరారు. "చంద్రబాబుకు మరోసారి సవాల్ చేస్తున్నా. దమ్ముంటే ఎమ్మెల్యేలు పార్టీ మారిన చోట ఎన్నికలకు రావాలి ప్రత్యేక హోదా కోసం జూన్ వరకు వేచి చూస్తాం. లేకుంటే మా ఎంపీలతో రాజీనామా చేయిస్తామ‌ని ప్ర‌క‌టించారు. దేశం మొత్తం ఏపీవైపు చూసేలా చేస్తామ‌ని, ఏపీలో ప్రతి వ్యక్తిని జాగ్రత్త పరుస్తాం"అని జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు. ప్రాజెక్టులపై చంద్రబాబు మాటలన్నీ అబద్ధాలేన‌ని జ‌గ‌న్ మండిప‌డ్డారు. 80 శాతం ప్రాజెక్ట్ ల పనులు చంద్రబాబు రాకముందే పూర్తయ్యాయని గుర్తు చేశారు. మిగతా 20 శాతం పనులను కూడా బాబు పూర్తి చేయలేదని అన్నారు. గండికోట - చిత్రావతి - పోతిరెడ్డిపాడు సహా ఏ ప్రాజెక్టు పూర్తి కాలేదని పేర్కొంటూ మూడేళ్లైనా చంద్రబాబుకు ప్రాజెక్టులు పూర్తి చేయాలన్న ధ్యాస లేద‌ని జగన్ మండిప‌డ్డారు. శ్రీశైలంలో నీళ్లున్నా రాయలసీమకు ఇవ్వలేదు అలాంటి మనిషి నిజాయితీ గురించి మాట్లాడుతున్నారని జ‌గ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పులిచింతల ప్రాజెక్ట్ బాబు సీఎం అయ్యేనాటికే పూర్తి అయిందని పేర్కొంటూ ఇప్పటివరకు నిర్వాసితులకు పరిహారం చెల్లించలేదని జగన్ త‌ప్పుప‌ట్టారు.

చంద్రబాబు అరగంట సేపు సభలో ప్రకటన చేశారని అయితే అది ఆత్మస్తుతి.. పరనిందలా ఉంద‌ని జగ‌న్‌ అన్నారు. చంద్రబాబు ప్రకటన రెచ్చగొట్టేలా ఉందని, పాత అంశాలను కావాలనే ప్రస్తావించారు జగన్ అన్నారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తినా అవకాశం ఇవ్వలేదని అన్నారు. స్టేట్ మెంట్ సమయంలో పాయింట్ ఆఫ్ ఆర్డర్ కు అవకాశం లేదని సభను తప్పుదోవ పట్టిస్తున్నారని జ‌గ‌న్ తెలిపారు. ప్ర‌తిపక్ష నేత అడిగితే సమయం ఇవ్వరా? చంద్రబాబు చేసింది కరెక్టేనా? అని జగన్ ప్ర‌శ్నించారు. చంద్రబాబు ప్రసంగం పూర్తయ్యాక తాము సభలోకి వెళ్లామ‌ని, అప్పుడు కూడా త‌మకు అవకాశం ఇవ్వలేదని జగన్ అన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/