జగన్ మంత్రివర్గంలో ఎవరెలా ప్రమాణస్వీకారం చేశారంటే?

Sat Jun 08 2019 14:55:47 GMT+0530 (IST)

అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కార్యక్రమం పూర్తి అయ్యింది. జగన్ టీం కొలువు తీరింది. తొలిసారే పూర్తిస్థాయి మంత్రిమండలిని కొలువుతీరేలా నిర్ణయం తీసుకున్నారు జగన్. దీనికి తగ్గట్లే ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కొత్త మంత్రులుగా ఎంపికైన వారి చేత పదవీ ప్రమాణస్వీకారం చేయించారు.అమరావతిలోని సచివాలయంలో సీఎం ఛాంబర్ పక్కనే ఉన్న కాన్ఫరెన్స్ హాలులో ప్రమాణస్వీకార కార్యక్రమం కన్నుల పండువగా సాగింది. అనవసరమైన ఆర్భాటాలకు పోకుండా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయటం గమనార్హం. ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి పార్టీ నేతలు.. శ్రేణులు.. అధికారులు.. ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ప్రోటెం స్పీకర్ గా నియమితులైన విజయనగరం జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే శంబంగి చిన అప్పలనాయుడు చేత గవర్నర్ నరసింహన్ పదవీ ప్రమాణస్వీకారోత్సవాన్ని చేయించారు. షెడ్యూల్ ప్రకారం ఈ కార్యక్రమాన్ని ఈ రోజు (శనివారం) ఉదయం 11.15 గంటలకు ప్రారంభించారు.

ప్రమాణస్వీకారోత్సవం తర్వాత కొత్త మంత్రులు.. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో.. గవర్నర్ నరసింహన్ తో కలిసి గ్రూపు ఫోటో దిగారు. ప్రమాణస్వీకారం చేశాక మంత్రులు వరుసగా సీఎం.. గవర్నర్ వద్దకు వెళ్లి అభివాదం చేశారు.

మంత్రులుగా ప్రమాణస్వీకారాన్నిఎవరెలా చేశారంటే..

+   శ్రీకాకుళం జిల్లాకు చెందిన ధర్మాన కృష్ణదాస్ మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ధర్మాన కృష్ణదాస్ అనే నేను అంటూ.. తెలుగుభాషలో దైవసాక్షిగా ప్రమాణం చేశారు.

+   విజయనగరం జిల్లాకు చెందిన బొత్స సత్యనారాయణ మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. బొత్స సత్యనారాయణ అనే నేను అంటూ.. తెలుగుభాషలో ఆయన దైవసాక్షిగా ప్రమాణం చేశారు.

+   విజయనగరం జిల్లాకు చెందిన పాముల పుష్పశ్రీవాణి  మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. పాముల పుష్పశ్రీవాణి అనే నేను అంటూ.. తెలుగుభాషలో దైవసాక్షిగా ప్రమాణం చేశారు.

+  విశాఖపట్నం జిల్లాకు చెందిన ముత్యంశెట్టి శ్రీనివాసరావు పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ముత్యంశెట్టి శ్రీనివాస రావు..  అవంతి శ్రీనివాస్ అనే నేను అంటూ తెలుగుభాషలో దైవసాక్షిగా ప్రమాణం చేశారు.

+   తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కురసాల కన్నబాబు మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. కురసాల కన్నబాబు అనే నేను అంటూ తెలుగుభాషలో దైవసాక్షిగా ప్రమాణం చేశారు.

+  తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్ మంత్రిగా  ప్రమాణం చేశారు. సుభాష్ చంద్రబోస్ పిల్లి అనే నేను.. అంటూ తెలుగుభాషలో దైవసాక్షిగా ప్రమాణం చేశారు.

+   తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పినిపె విశ్వరూప్ (ఎస్సీ-మాల)  మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. విశ్వరూప్ పినిపె అనే నేను అంటూ తెలుగుభాషలో దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు.

+   పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కాళీకృష్ణ శ్రీనివాస్ ఆళ్ల అనే నేను అంటూ తెలుగుభాషలో దైవసాక్షిగా ప్రమాణం చేశారు.

+  పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన చెరుకువాడ శ్రీరంగనాథరాజు మంత్రిగా ప్రమాణం చేశారు. చెరుకువాడ శ్రీరంగనాథరాజు అనే నేను తెలుగుభాషలో దైవసాక్షిగా ప్రమాణం చేశారు.

+   పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన తానేటి వనిత మంత్రిగా పదవీ స్వీకారం చేశారు.  వనిత తానేటి అనే నేను అంటూ తెలుగుభాషలో దైవసాక్షిగా ప్రమాణం చేశారు.

+   కృష్ణా జిల్లాకు చెందిన కొడాలి శ్రీ వెంకటేశ్వర్‌రావు (కమ్మ) మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. కొడాలి శ్రీ వెంకటేశ్వర్‌రావు నాని అనే నేను అంటూ తెలుగుభాషలో దైవసాక్షిగా ప్రమాణం చేశారు.

+  కృష్ణా జిల్లాకు చెందిన  పేర్ని నాని మంత్రిగా ప్రమాణం చేశారు. పేర్ని వెంకటరామయ్య నాని అనే నేను అంటూ తెలుగుభాషలో దైవసాక్షిగా  ప్రమాణం చేశారు.

+   కృష్ణా జిల్లాకు చెందిన వెలంపల్లి శ్రీనివాస్ మంత్రిగా ప్రమాణం చేశారు.  వెల్లంపల్లి శ్రీనివాస్ అనే నేను అంటూ తెలుగుభాషలో దైవసాక్షిగా ప్రమాణం చేశారు.

+  గుంటూరు జిల్లాకు చెందిన మేకతోటి సుచరిత మంత్రిగా ప్రమాణం చేశారు. మేకతోటి సుచరిత అనే నేను అంటూ తెలుగుభాషలో దైవసాక్షిగా ప్రమాణం చేశారు.

+  గుంటూరు జిల్లాకు చెందిన మోపిదేవి వెంకటరమణారావు మంత్రిగా ప్రమాణం చేశారు. మోపిదేవి వెంకట రమణారావు అనే నేను అంటూ తెలుగుభాషలో దైవసాక్షిగా ప్రమాణం చేశారు.

+  ప్రకాశం జిల్లాకు చెందిన బాలినేని శ్రీనివాసరెడ్డి మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. బాలినేని శ్రీనివాసరెడ్డి వాసు అనే నేను అంటూ తెలుగుభాషలో దైవసాక్షిగా  ప్రమాణం చేశారు.

+  ప్రకాశం జిల్లాకు చెందిన ఆదిమూలపు సురేష్ మంత్రిగా ప్రమాణం చేశారు. ఆదిమూలపు సురేష్ అనే నేను అంటూ ఆంగ్లభాషలో దైవసాక్షిగా ప్రమాణం చేశారు.

+  నెల్లూరు జిల్లాకు చెందిన పాలుబోయిన అనిల్‌కుమార్ యాదవ్  మంత్రిగా  ప్రమాణం చేశారు. అనిల్‌కుమార్ యాదవ్ పాలుబోయిన అనే నేను అంటూ తెలుగుభాషలో దైవసాక్షిగా ప్రమాణం చేశారు.

+  నెల్లూరు జిల్లాకు మేకపాటి గౌతమ్‌రెడ్డి మంత్రిగా ప్రమాణం చేశారు. మేకపాటి గౌతమ్‌రెడ్డి అనే నేను అంటూ ఆంగ్లభాషలో దైవసాక్షిగా ప్రమాణం చేశారు.

+   చిత్తూరు జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే నేను అంటూ తెలుగుభాషలో దైవసాక్షిగా ప్రమాణం చేశారు.

+   చిత్తూరు జిల్లాకు చెందిన కళత్తూరు నారాయణస్వామి మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. కళత్తూరు నారాయణస్వామి అనే నేను అంటూ తెలుగుభాషలో దైవసాక్షిగా ప్రమాణం చేశారు.

+   కర్నూలు జిల్లాకు చెందిన బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు.  బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అనే నేను అంటూ తెలుగుభాషలో దైవసాక్షిగా ప్రమాణం చేశారు.

+   కర్నూలు జిల్లాకు చెందిన గుమ్మనూరు జయరామ్ మంత్రిగా ప్రమాణం చేశారు. గుమ్మనూరు జయరామ్ అనే నేను అంటూ తెలుగుభాషలో దైవసాక్షిగా ప్రమాణం చేశారు.

+  కడప జిల్లాకు చెందిన షేక్ బేపారి అంజాద్ బాషా మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ఎస్‌బీ అంజాద్ అనే నేను అంటూ తెలుగుభాషలో అల్లా సాక్షిగా ప్రమాణం చేశారు.

+  అనంతపురం జిల్లాకు చెందిన మాలగుండ్ల శంకరనారాయణ  మంత్రిగా ప్రమాణం చేశారు. మాలగుండ్ల శంకర నారాయణ అనే నేను అంటూ తెలుగుభాషలో దైవసాక్షిగా ప్రమాణం చేశారు.