Begin typing your search above and press return to search.

మోడీ.. ఇవాంకాలు అలా వ‌స్తార‌ట‌!

By:  Tupaki Desk   |   22 Nov 2017 6:45 AM GMT
మోడీ.. ఇవాంకాలు అలా వ‌స్తార‌ట‌!
X
ఒకే రోజు ఒకే మ‌హాన‌గ‌రంలో రెండు భారీ కార్య‌క్ర‌మాలు వేర్వేరుగా నిర్వ‌హించ‌టం ఉంటుందా? అంటే.. లేద‌నే అంటారు. కానీ.. అందుకు భిన్నంగా ఒకే రోజు రెండు భారీ కార్య‌క్ర‌మాల‌కు వేదిక కానుంది హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రం. అంత‌ర్జాతీయ బిజినెస్ స‌మ్మిట్ .. హైద‌రాబాద్ ప్ర‌జ‌లెంతో ఆతృత‌గా ఎదురుచూస్తున్న హైద‌రాబాద్ మెట్రో రైల్ ఈ నెల 28న ప్రారంభం కానున్నాయి.

ఈ రెండు కార్య‌క్ర‌మాలకు విశిష్ఠ అతిధిగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ హాజ‌ర‌వుతుంటే.. అంత‌ర్జాతీయ బిజినెస్ స‌మ్మిట్‌కు అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నున్నారు. మ‌రి.. ఈ ఇద్ద‌రు ప్ర‌ముఖులు హైద‌రాబాద్ కు ఎలా రానున్నారు? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

మొద‌ట అనుకున్న దాని ప్ర‌కారం ఇవాంకా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకునేలా ప్లాన్ చేశారు. ప్ర‌ధాని మోడీని బేగంపేట విమానాశ్ర‌యానికి చేరుకునేలా అనుకున్నారు. అయితే.. రెండు వైపుల నుంచి ఇద్ద‌రు ముఖ్య అతిధుల‌ను తీసుకెళ్ల‌టం ఇబ్బంది అవుతుంద‌న్న సందేహాం వ్య‌క్త‌మైంది.

అదే స‌మ‌యంలో భ‌ద్ర‌తా ప‌రమైన అంశాల్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని.. మోడీ.. ఇవాంకాలు ఇద్ద‌రిని బేగంపేట ఎయిర్ పోర్ట్‌ కు తీసుకురావాల‌న్న ఆలోచ‌న‌ను చేసిన‌ట్లుగా తెలుస్తోంది. తాజాగా ఐబీ చేసిన హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో ఇరువురు ప్ర‌ముఖులు ఒకే విమానాశ్ర‌యానికి చేరుకుంటే భ‌ద్ర‌తాప‌రంగా మ‌రింత సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇవాంకా బేగంపేట విమానాశ్ర‌యం నుంచి ప్ర‌త్యేక హెలికాఫ్ట‌ర్ లో హెచ్ ఐసీసీకి తీసుకెళ‌తార‌ని చెబుతున్నారు. ఇక‌.. ప్ర‌ధాని మోడీ బేగంపేట నుంచి మియాపూర్ మెట్రో స్టేష‌న్ వ‌ద్ద‌కు ప్ర‌త్యేక హెలికాఫ్ట‌ర్ లో వెళ్ల‌నున్నారు. ఆయ‌న కోసం అక్క‌డ రెండున్న‌ర ఎక‌రాల స్థ‌లంలో మూడు హెలిప్యాడ్ ల‌ను సిద్ధం చేస్తున్నారు.