Begin typing your search above and press return to search.

జీసస్ నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టాడు: వర్మ

By:  Tupaki Desk   |   8 Feb 2019 5:42 AM GMT
జీసస్ నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టాడు: వర్మ
X
రామ్ గోపాల్ వర్మ మామూలు మనిషి కాదని అందరికీ తెలిసిన విషయమే. అందుకే చాలామంది సెలెబ్రిటిలు అయనతో తకరారు పెట్టుకోవడానికి చాలా చాలా ఆలోచిస్తారు. వాళ్ళ భయం ఏంటంటే తప్పొప్పుల మాట అటుంచి వీలైనంత బురద తమకు అంటిస్తాడనే. గతంలో చాలామందికి ఇలాంటిదే అనుభవం అయింది. ఇదిలా ఉంటే తాజాగా క్రైస్తవ బోధకుడు.. ప్రజా శాంతి పార్టి వ్యవస్థాపకుడు కేఎ పాల్ పై వీలైనంతగా ఫోకస్ చేస్తున్నారు వర్మ.

కొన్ని రోజుల క్రితం వర్మ తన కాళ్ళను తాకి ఆశీర్వాదం తీసుకున్నారని కేఎ పాల్ మీడియా ముఖంగా చెప్పడం ఈ 'ఫోకస్' కు కారణం. అప్పటి నుండి తరచుగా పాల్ పై వ్యంగ్య బాణాలు విసురుతూ ఉన్న వర్మ తాజాగా ఆ దాడిని పాల్ కు సంబంధించిన ఒక వీడియో షేర్ చేస్తూ మరో లెవెల్ కు తీసుకెళ్ళాడు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే కేఎ పాల్ తన సహజ శైలిలో భారత దేశంలో తీవ్రవాదం.. మతవాదం పెరుగుతోందని.. అన్ని మతాలలో కొంతశాతం ఇది ఉందని.. కాబట్టి మనమందరం ఈ కులమత జాతి భేదాలను పక్కన పెట్టి భారత దేశం అభ్యున్నతికి పాటుపడాలని.. ప్రపంచంలో భారత దేశాన్ని అగ్రగామిగా నిలపాలని కాస్త ఎమోషనల్ గా సందేశం ఇచ్చారు. ఈ వీడియోను షేర్ చేసిన వర్మ వరస ట్వీట్ల వర్షం కురిపించారు.

"ఈ వీడియో కనుక జీసస్ క్రైస్ట్ చూస్తే మరో సారి షాక్ తో బతికి వచ్చి .. సిగ్గుతో చనిపోతాడు. ఈ ప్రపంచంలో ఎన్నో రకాల కోతి జాతులున్నాయి కానీ ఇంతకంటే మరో కోతి ఉండదు. కోతులతో పోల్చి.. వాటిని అవమానించినందుకు ఆ కోతులన్నీ నామీద దాడి చేస్తాయేమో. ఎపీని ఆశీర్వదించేలా జీసస్ తన ఉత్తమ కోతికి ఒక బహుమతి ఇవ్వాలని కోరుకుంటున్నా. తన పేరు ఇంతగా చెడగొడుతున్నందుకు కేఎ పాల్ కు శిలువ వేయబోతున్నానని జీసస్ క్రైస్ట్ ఇప్పుడే నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టాడు. నాకు జీనస్ కేఎ పాల్ మంకీటస్ అనే రకం జీవులు తెలుసు గానీ పాల్ పై ఆధారపడి పాల్ ను ఎపీ ముఖ్యమంత్రిని చేస్తామని ఆయనకు చెబుతున్న పరాన్నజీవులు నాకు అర్థం కారు. కేఎ పాల్ చుట్టూ చేరి పిచ్చి సలహాలిస్తూ ఉన్న వారికి జీసస్ క్రైస్ట్ తప్పనిసరిగా ఎముకలను విరగ్గొట్టి.. తోలు తీస్తాడు. సార్.. కేఎ పాల్ గారు మీ చుట్టూ దెయ్యం శిష్యులు ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని కాల్చి బూడిద చేసే ముందే మీరు వారిని కాల్చేయండి."

కేఎ పాల్ ను టార్గెట్ చేయడం వరకూ సరేగానీ ఈ వివాదం లోని ఏకంగా జీసస్ క్రైస్ట్ ను లాగడం పై అప్పుడే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే హిందు పండగలపై.. గణేశుడిపై వింత వ్యాఖ్యలు చేసి కొందరి ఆగ్రహానికి గురైన వర్మ ఇప్పుడు క్రైస్తవుల ఆగ్రహానికి గురవడం ఖాయమేననే అభిప్రాయలు విన్పిస్తున్నాయి.