Begin typing your search above and press return to search.

షర్మిల దీక్ష 16ఏళ్లకు ముగియనుంది!

By:  Tupaki Desk   |   26 July 2016 12:09 PM GMT
షర్మిల దీక్ష 16ఏళ్లకు ముగియనుంది!
X
ఆమె ఒక ఐరన్ లేడీ.. దీక్ష అంటే ముందుగా నిర్ధేశించుకున్న సమయంలో ముగించడం కాదని సుమారు 16ఏళ్లగా నిరాహార దీక్ష చేస్తున్న వీరనారి! అవును.. భద్రతా దళాల ప్రత్యేక హక్కుల చట్టాన్ని రద్దు చేయాలని ఆమె మొదలు పెట్టిన పోరాటం మామూలు విషయం కాదు. అయితె 2000 - నవంబరులో దీక్ష మొదలుపెట్టిన షర్మిల తన ఉద్యమానికి సంబందించి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ప్రకారం తన 16ఏళ్ల నిరాహార దీక్షను విరమించనున్నారు. ఇంఫాల్ లోని కోర్టు బయట మీడియాతో మాట్లాడిన షర్మిల.. ఆగస్టు 9న దీక్షకు ముగింపు పలకనున్నట్లు తెలిపారు. అనంతరం ఎన్నికల్లో పోటీచేయనున్నట్లు ప్రకటించారు.

మణిపూర్‌ (షర్మిల స్వరాష్ట్రం) సహా ఈశాన్య రాష్ట్రాల్లో ఆర్మీ దళాల ప్రత్యేక హక్కుల చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ షర్మిల గత 16ఏళ్లుగా నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. కేవలం ముక్కుకు అమర్చిన పైపు ద్వారా అందిస్తున్న ద్రావణాలతోనే ఆమె తన జీవనం సాగిస్తున్నారు. ఇంఫాల్‌ విమానాశ్రయానికి సమీపంలోని బస్‌ స్టాప్‌ లో నిలబడి ఉన్న పది మందిని అస్సాం రైఫిల్స్‌ సైనికులు కాల్చి చంపడంపై ప్రారంభమైన ఆమె దీక్ష ఇంతవరకూ పట్టువదలకుండా సాగింది.

ఇలా క‌ల్లోలిత ప్రాంతాల్లో భార‌త ప్ర‌భుత్వం 1958 నుంచి ప్ర‌యోగిస్తున్న ఏఎఫ్ ఎస్‌ పీఏను వెంట‌నే ర‌ద్దు చేయాల‌ని ఆమె డిమాండ్ చేశారు. ఈ చట్టంప్రకారం ఎవ‌రినైనా చంపే హ‌క్కును సాయుధ ద‌ళాలకు సుమారుగా ఉంది!! అయితే ఈమె దీక్ష మొదలుపెట్టి ఇన్నేళ్లయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈమధ్య కాలంలో సుప్రీంకోర్టు కూడా మణిపూర్‌ ఆర్మీకి ప్రత్యేక హక్కుల చట్టాన్ని వ్యతిరేకించిన సంగతి తెలిసిందే!