Begin typing your search above and press return to search.

పోర్న్ సైట్లపై నాలుగైదు సర్వీసు ప్రొవైడర్ల బ్యాన్

By:  Tupaki Desk   |   3 Aug 2015 5:17 AM GMT
పోర్న్ సైట్లపై నాలుగైదు సర్వీసు ప్రొవైడర్ల బ్యాన్
X
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల్లో.. మరే ఇతర కారణాలో బయటకు రావటం లేదు కానీ.. అశ్లీల వెబ్ సైట్లు భారత్ లో బంద్ అయ్యాయి. అలా అని పూర్తిగా కాదు సుమా. నాలుగైదు టెలికం సర్వీసు ప్రొవైడర్లు అందించే ఇంటర్నెట్ సేవల్లో వీటిని నిలిపి వేశారు.

ఒకవైపు ఒక పరిమితి దాటిన వయస్కులు అశ్లీల చిత్రాలు చూడటం తప్పేం కాదన్న తీర్పును సుప్రీం కోర్టు ఇచ్చినప్పటికీ.. అశ్లీల వెబ్ సైట్ల మీద ఉక్కుపాదం మోపాలన్న కేంద్రం ఆలోచనకు తగ్గట్లే దేశంలో వీటి నిషేధానికి సంబంధించి మొదటి అడుగు పడిందని చెబుతున్నారు.

ఎంటీఎన్ ఎల్.. బీఎస్ ఎన్ ఎల్.. బీమ్.. హాత్ వేతో పాటు కొన్ని సర్వీసు ప్రొవైడర్లు అందించే ఇంటర్నెట్ సేవల్లో అశ్లీల వెబ్ సైట్లు ఓపెన్ కాని పరిస్థితి. ఆ మాటకు వస్తే.. పోర్న్ అనే పదం టైప్ చేసిన వెంటనే.. యాక్సిస్ డినైడ్ అన్న మాట తెరపై సాక్ష్యాత్కరిస్తోంది.

అధికారుల సూచన మీద.. సదరు సైట్లను నిషేధించినట్లుగా కంప్యూటర్ స్క్రీన్ల పై దర్శనమిస్తోంది. టాప్ 13 పోర్న్ సైట్లలో 11 సైట్ల వరకూ ఓపెన్ కావటం లేదని చెబుతున్నారు. మరోవైపు.. ఎయిర్ టెల్.. వోడా.. రిలయన్స్ లాంటి సంస్థల ఇంటర్నెట్ ప్యాకేజీల్లో ప్రస్తుతం అశ్లీల సైట్లు రావటం గమనార్హం.

ఒకపక్క అశ్లీల సైట్లను చూసే విషయంలో సుప్రీం సానుకూలంగా స్పందించినప్పటికీ.. ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా బ్యాన్ విధించటంపై దేశ వ్యాప్తంగా మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. లైంగిక నేరాలు.. దాడులను నిరోధించేలా పోర్న్ సైట్ల బ్యాన్ సాయం చేస్తుందని చెబుతుంటే.. మరికొందరు మాత్రం అలాంటివేమీ డవని.. పోర్న్ సైట్ల నిషేధం కారణంగా వాటి మీద మరింత ఆసక్తి పెరుగుతుందే తప్పించి.. తగ్గదన్న వాదనను వినిపిస్తున్నారు. అయితే.. ఈ సైట్ల నిషేధంపై కేంద్ర సర్కారు ఇప్పటివరకూ అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయకపోవటం గమనార్హం.