Begin typing your search above and press return to search.

మ‌నోళ్లు ఆ దేశంలో ఉంటే ఎన్ని పెళ్లిళ్ల‌యినా ఓకే!

By:  Tupaki Desk   |   16 Aug 2017 7:05 PM GMT
మ‌నోళ్లు ఆ దేశంలో ఉంటే ఎన్ని పెళ్లిళ్ల‌యినా ఓకే!
X
ముస్లిం ఆదిప‌త్య దేశ‌మైన బంగ్లాదేశ్ గురించి ఆస‌క్తిక‌ర‌మైన స‌మాచారం వెలుగులోకి వ‌చ్చింది. ఇండియాలో ముస్లింల‌కు ఉన్న చ‌ట్టాలు బంగ్లాదేశ్‌ లో హిందువుల‌కు ఉన్నాయ‌ని అమెరికా ప్ర‌భుత్వ నివేదిక ఒక‌టి అభిప్రాయ‌ప‌డింది. ఇంట‌ర్నేష‌న‌ల్ రిలిజియ‌స్ ఫ్రీడ‌మ్ రిపోర్ట్ (ఐఆర్ ఎఫ్ ఆర్‌)ను వాషింగ్ట‌న్‌ లో విడుద‌ల చేశారు. వివిధ దేశాల్లో మ‌తాల‌కు అనుగుణంగా ఉన్న వివాహ చ‌ట్టాల‌పై అధ్యయ‌నం చేసి ఈ నివేదిక రూపొందించారు. దీని ప్ర‌కారం బంగ్లాదేశ్‌ లో ఉన్న హిందూ మ‌తానికి చెందిన పురుషులకు అక్క‌డి హిందూ చ‌ట్టం ప్ర‌కారం ఎన్ని పెళ్లిళ్ల‌యినా చేసుకొనే అవ‌కాశం ఉంద‌ని ఈ నివేదిక వెల్ల‌డించింది. అయితే విడాకులకు మాత్రం అధికారికంగా ఎలాంటి అవ‌కాశం లేద‌ని రిపోర్ట్ చెప్పింది.

బంగ్లాదేశ్‌లో ఉన్న బౌద్ధ‌మ‌త‌స్థుల‌కు కూడా హిందూ చ‌ట్టాల‌నే వ‌ర్తింప‌జేస్తున్నార‌ని, అయితే హిందువులైనా, బౌద్దులైనా విడాకులు తీసుకొని మ‌ళ్లీ పెళ్లి చేసుకొనే చాన్స్ లేద‌ట‌. దీనిపై అక్క‌డ తీవ్ర వ్య‌తిరేక‌త కూడా ఉన్న‌ది. ఇక అక్క‌డి హిందూ చ‌ట్టాల ప్ర‌కారం మ‌హిళ‌ల‌కు ఆస్తిలో వాటా ద‌క్క‌దు. ప్ర‌స్తుతం ఉన్న హిందూ చ‌ట్టాల కార‌ణంగా బంగ్లాదేశ్‌లో ఉంటున్న 26.7 శాతం మంది పురుషులు, 29.2 శాతం మంది మ‌హిళ‌లు విడాకులు తీసుకోవాల‌నుకుంటున్నా.. కుద‌ర‌డం లేద‌ని ఈ నివేదిక వెల్ల‌డించింది. ఇక ముస్లిం పురుషుడు భార్య స‌మ్మ‌తితో గ‌రిష్ఠంగా న‌లుగురిని పెళ్లి చేసుకొనే అవ‌కాశం అక్క‌డి చ‌ట్టాలు క‌ల్పిస్తున్న‌ట్లు రిపోర్ట్ చెప్పింది. పాకిస్థాన్‌ లో మాత్రం ముస్లింల‌కు త‌ప్ప ఇత‌ర మ‌తాల వారికి ప్ర‌త్యేకంగా చ‌ట్టాలేవీ లేక‌పోవ‌డంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న‌ట్లు బ‌య‌ట‌ప‌డింది.